శ్రీవారి భక్తులకు వారి లగేజీని తిరుపతి నుండి తిరుమలకు తరలించి ఉచితం అందజేస్తాము..

శ్రీవారి భక్తులకు( Devotees ) ఎయిర్ పోర్టు తరహాలో, వారి లగేజీని తిరుపతి( Tirupati ) నుండి తిరుమలకు తరలించి ఉచితంగా అందజేస్తామని, టిటిడి.ఈఓ ఏవి ధర్మారెడ్డి( EO Dharma Reddy ) తెలిపారు.

 We Provide Free Transportation Of Luggage From Tirupati To Tirumala To Srivari D-TeluguStop.com

తిరుమల నడకదారి భక్తులకు సులభతరంగా వుండేలా లగేజిని టిటిడి ఉచితంగా తరలిస్తోందని దర్మారెడ్డి తెలిపారు.గతంలో లగేజి తరలింపు…తిరిగి అప్పగించడం మ్యానువల్ పద్దతిలో నిర్వహించామని, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో, ట్రాక్ ఐడీ విధానం తోసాఫ్ట్వేర్ రూపొందించి, లగేజీ ఎక్కడ ఉందో తెలుసుకునే విధంగా భక్తులు , సెల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

అధునాతన గ్యాడ్జెట్స్ తో, భక్తుల లగేజీని తనిఖీ చేయవచ్చునన్నారు.హార్డ్వేర్ కు సంబంధించి క్రిస్టియన్ భక్తుడైన చార్లస్ 2 కోట్లు విరాళంగా అందించారన్నారు…

తిరుమల అన్నమయ్య భవన్లో లగేజీ నూతన ట్రాన్స్పోర్ట్ సిస్టంను, డెమోగా ప్రదర్శించి వివరించారు.

దాతల సహకారంతో ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామనిఈవో.ధర్మా రెడ్డి తెలిపారు.

లగేజీ కౌంటర్లలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేస్తామన్నారు.ఇప్పటికే సిబ్బందికి నూతన విధానంపై శిక్షణ ఇచ్చామన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో సీ.వీ.ఎస్.ఓ నరసింహ కిషోర్ పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube