కొద్దిరోజుల క్రితం తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి.ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని , మెజారిటీ స్థానాలను గెలుచుకోబోతున్నామని , బీఆర్ఎస్ , బిజెపి, కాంగ్రెస్ లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అయితే ప్రధానంగా కాంగ్రెస్, బిజెపిల మధ్య పోటీ నెలకొందని , బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం అవుతుందనే ప్రచారం తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తోంది.లోక్ సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు ధీటుగా తాము మెజారిటీ స్థానాలను దక్కించుకుంటామని, ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది.
పోలింగ్ సరళిని పరిశీలించిన బీఆర్ఎస్( BRS party ) నేతలు గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గం ఒక అంచనాకు వచ్చారు.హైదరాబాద్ మినహాయించి మిగిలిన 16 స్థానాల్లో పోలింగ్ జరిగిన తీరును బీఆర్ఎస్ స్వాగతిస్తోంది.
సైలెంట్ ఓటింగ్ తమకి కలిసి వస్తుందని ఆశలు పెట్టుకుంది.తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
అయితే హైదరాబాద్ స్థానం ఎంఐఎం కు కంచుకోట కావడంతో, మిగిలిన స్థానాల్లో తప్పకుండా తామే గెలుస్తామని అంచనా వేస్తున్నాయి.

పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి వస్తున్న సమాచారంతో , మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డబల్ డిజిట్ స్థానాలను కచ్చితంగా గెలుచుకుంటామని అంచనా వేస్తున్నారు.అయితే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన తర్వాత, ఆరు నుంచి ఏడు స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని బీఆర్ఎస్ కీలక నేతలు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
ముఖ్యంగా కరీంనగర్, మెదక్ ,పెద్దపల్లి , నాగర్ కర్నూల్ నియోజక వర్గాల్లో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్ అనే అంచనాకు వస్తున్నాయి.ఇక సికింద్రాబాద్, నిజామాబాద్ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై ఐదు నెలల కాలంలో తీవ్రంగా వ్యతిరేకత వచ్చిందని బిఆర్ఎస్ అంచనా వేస్తోంది .దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు అనుకూలంగా మారుతుందని, బిజెపి( BJP )కి క్షేత్రస్థాయిలో సరైన కేడర్ లేకపోవడం కూడా బీఆర్ఎస్ విజయవకాశాలను మెరుగుపరుస్తాయని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది.చాలా నియోజకవర్గాల్లో బిజెపి ప్రభావం ఉన్నప్పటికీ , బీఆర్ఎస్ , కాంగ్రెస్ అభ్యర్థులు గట్టిగానే పోటీ ఇచ్చారని, మరికొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ బిజెపి మధ్య ప్రధానంగా పోటీ నెలకొందని చెబుతున్నారు.ఏది ఏమైనా కాంగ్రెస్, బిజెపిల కంటే ఎక్కువ స్థానాలని గెలుచుకుంటామని ఆ పార్టీ అంచనాకు వస్తుంది.