సాధారణంగా వయసు పైబడే కొద్ది యవ్వనం తగ్గిపోతూ ఉంటుంది.చర్మంపై ముడతలు, మచ్చల కారణంగా ముఖంలో కాంతి క్షీణిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే యవ్వనంగా కనిపించేందుకు రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు.అయినప్పటికీ, ఎలాంటి ఫలితం లేకుంటే తీవ్రంగా కృంగిపోతుంటారు.
అయితే వయసు పెరిగినా చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేయడంలో రోజ్ మేరీ ఆయిల్ అద్భుతంగా సమాయపడుతుంది.రోజ్ మెరీ ఆయిల్‌తో చర్మానికి ఉపయోగపడే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
మరి ఇంతకీ రోజ్ మేరీ ఆయిల్ ను చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముడతలతో సమస్యతో బాధ పడే వారు.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రోజ్ మెరీ ఆయిల్ మరియు కోకోనట్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.
బాగా మసాజ్ చేసుకోవాలి.డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే ముడతలు పోయి.చర్మం యవ్వనంగా మరియు కాంతివంతంగా మారుతుంది.
అలాగే ఒక బౌల్‌లో రోజ్ మేరీ ఆయిల్ మరియు అలోవెర జెల్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమానికి అప్లై చేసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి.అనంతరం కూల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల ముఖం యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా మెరుస్తుంది.
ఇక ముఖంపై మచ్చలు ఉన్న వారు.
ఒక బౌల్‌లో రోజ్ మెరీ ఆయిల్, పెరుగు మరియు చిటికెడు పసుపు వేసి కలిపి.ముఖానికి పట్టించాలి.
బాగా డ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్లు జిల్లి వేళ్లతో మెల్ల మెల్లగా రుద్దతూ ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే మచ్చలు పోవడంతో పాటు ముఖంలో గ్లో కూడా పెరుగుతుంది.