దొంగలు రోజు రోజుకు కొత్త కొత్త పద్ధతులను అవలంభిస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు.పక్కనే నిలబడి మరీ వారి పని కానిచ్చేస్తున్నారు.
ఆధునిక సాంకేతికత పెరుగుతున్నప్పటికీ, చోరీలు మాత్రం తగ్గడం లేదు.సీసీ కెమెరాలు, చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉండడంతో ఇలాంటి ఘటనలు త్వరగా వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా, ఇలాంటి ఓ ఘటన నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.వైరల్ అవుతున్న ఓ వీడియోలో,( Viral Video ) జన సమూహంలో ఓ యువకుడు అందరినీ గమనిస్తూ నిలబడి ఉంటాడు.
అతడి ఎదరుగా ఉన్న మరో వ్యక్తి తన ఫోన్‌ను( Phone ) చొక్కా జేబులో పెట్టుకుని ఉంటాడు.ఆ ఫోన్‌పై కన్నేసిన దొంగ( Thief ) తెలివిగా వ్యవహరిస్తాడు.
సాదాసీదాగా చేతులు కట్టుకుని నిలబడి, ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడతాడు.
అయితే, క్షణాల్లోనే అతడు మాయజాలంలా ఆ వ్యక్తి జేబులోని ఫోన్‌ను తీశాడు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఫోన్ తీసుకున్న వెంటనే బాధితుడు అలెర్ట్ అయ్యాడు.వెంటనే దొంగను నిలదీసి, తన ఫోన్‌ను తిరిగి తీసుకున్నాడు.
ఈ అనూహ్య సంఘటనను అక్కడే ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దానితో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
నెటిజన్లు దీన్ని చూసి తమదైన శైలిలో స్పందిస్తున్నారు.ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి.
దొంగలు సముదాయాల్లో గమనించకుండా చోరీ చేయడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం.
స్మార్ట్‌ఫోన్లు, వాలెట్‌లు వంటి విలువైన వస్తువులను రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.
వైరల్ గా మారిన ఈ వీడియోపై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.అయ్యబాబోయ్.ఈ దొంగ తెలివి మామూలుగా లేదుగా అంటూ కొందరు కామెంట్ చేయగా.
, బహిరంగా ప్రదేశాలలో( Public Places ) ఇలా అప్రమత్తంగా ఉంటే చోరీకి గురయ్యే అవకాశమే ఉండదఅని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరు మాత్రం ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఘటన మరోసారి ప్రజలకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది
.