చుండ్రు( Dandruff ) అనేది పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందిని కామన్ గా వేధించే సమస్య.చుండ్రు వల్ల తల పొడిబారడం, దురద, చికాకు, జుట్టు అధికంగా రాలిపోవడం, తల చర్మం ఎర్రబడటం, ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తలెత్తడం తదితర సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
ఈ క్రమంలోనే చుండ్రు నివారణకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే చుండ్రు సమస్యను దూరం చేసే బెస్ట్ సొల్యూషన్ ఒకటి ఉంది.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( Cloves ) వేసుకోవాలి, అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek Seeds ) మరియు అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాగా బాయిల్ అయ్యాక గ్రైండ్ చేసుకున్న లవంగాలు, మెంతులు, దాల్చినచెక్క పొడిని వేసి దాదాపు పది నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన నీటిని వడకట్టి చల్లారబెట్టుకోవాలి.

గోరువెచ్చగా అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసి మిక్స్ చేస్తే మంచి యాంటీ డాండ్రఫ్ టానిక్ రెడీ అవుతుంది.ఈ టానిక్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకుని స్కాల్ప్ కి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఈ టానిక్ ను కనుక వాడారంటే చుండ్రు సమస్య దూరం అవుతుంది.తల చర్మం శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.అంతేకాకుండా ఈ టానిక్ హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మారుస్తుంది.
హెయిర్ ఫాల్ సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.చాలామంది తమ జుట్టు సరిగ్గా ఎదగడం లేదని బాధపడుతుంటారు.
అలాంటి వారు కూడా ఈ టానిక్ ను ఉపయోగించవచ్చు.హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహించడంలోనూ ఈ టానిక్ సహాయపడుతుంది.