ప్రస్తుతం చలి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో ఆరోగ్య, చర్మ సమస్యలే కాదు కేశ సంబంధిత సమస్యలూ ఎక్కువగానే ఇబ్బంది పెడుతుంటాయి.
ముఖ్యంగా జుట్టు రాలి పోవడం, పొడి బారిపోయి ఎండినట్టు అయిపోవడం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లి పోవడం వంటి సమస్యలు ఈ కాలంలో ప్రధానంగా వేధిస్తుంటాయి.అయితే ఈ సమస్యలను నివారించి జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.
మరి ఆ ఆహారాలు ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
చలి కాలంలో జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే ఆహారాల్లో వేరుశెనగలు ఒకటి.
వేరుశెనగలను తరచూ తీసుకుంటే.అందులోని ఐరన్ మరియు జింక్ వంటి పోషకాలు జుట్టు డ్రై అవ్వడాన్ని తగ్గించి స్ట్రాంగ్ గా మారుస్తాయి.
ఉడికించిన కోడి గుడ్డును నిత్యం తినాలి.దాంతో అందులోని ప్రోటీన్‌ను కంటెంట్ కురుల కుదుళ్లకు బలాన్ని చేకూర్చి హెయిర్ ఫాల్‌కి అడ్డు కట్ట వేస్తుంది.

చేపలు, రొయ్యలు వంటి సీఫుడ్‌ను వారానికి కనీసం ఒక్కసారైన తినాలి.తద్వారా సీఫుడ్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును, మాడును ఆరోగ్యంగా ఉంచి.తలలో ఈస్ట్ పెరుగుదలను నివారిస్తాయి.ఫలితంగా చుండ్రు సమస్య దరి చేరకుండా ఉంటుంది.పాల కూర, తోట కూర, మెంతి కూర క్యాలీఫ్లవర్, క్యాబేజ్ వంటి ఆకు కూరలను చలి కాలంలో తరచూ తీసుకుంటే.వాటిల్లో పుష్కలంగా ఉండే బయోటిన్ జుట్టు చిట్లడాన్ని, విరగడాన్ని నివారిస్తాయి.
ఇక ఇవే కాకుండా సోయా బీన్స్, తృణ ధాన్యాలు, బఠానీలు, అరటి పండ్లు, గోధుమలు, మాంసాహారం, పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు, వాల్ నట్స్ వంటి వాటిని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి.అప్పుడే చలి కాలంలో జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.