ఆనాటి రాముడు ఎలా ఉన్నాడు ఇప్పుడు..చూస్తే గుర్తు పట్టలేరు

సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ చేయాలంటే మాత్రం కొందరు మనుషులు మాత్రమే గుర్తొస్తారు.అట్లాంటి క్యారెక్టర్లు చేసిన వాళ్ళ లో తెలుగులో అయితే రాముడు, కృష్ణుడు లాంటి దేవుళ్ళ వేషాలు వేయాలంటే అది ఒక్క ఎన్టీఆర్ గారి తోనే సాధ్యమయ్యేది.

 Sriram Character Fame Arun Govil Then And Now, Arun Govil, Vijay Govil, Ramanand-TeluguStop.com

అలాగే అప్పట్లో జనాలు కూడా ఆ పాత్రలో ఎన్టీఆర్ని తప్ప వేరే వాళ్లను ఊహించే వారు కాదు.ఎందుకంటే ఎన్టీఆర్ గారు చాలా సినిమాల్లో రాముడు, కృష్ణుడు లాంటి గెటప్ లతో దేవుడు అంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా నటించి ప్రేక్షకుల్ని తన నటనతో మంత్రముగ్ధుల్ని చేశాడు.

అందుకే తెలుగులో దేవుడు పాత్రలు చేయాలంటే అది నందమూరి తారక రామారావు లాంటి గొప్ప మనుషులు తప్ప మిగతా వాళ్లు చేయలేరు అని ఆప్పుడు ఉన్న జనాలతో పాటు ఆర్టిస్టులు కూడా దేవుడు పాత్రలు చేయాలంటే మా వల్ల కాదు అది ఎన్టీఆర్ గారి చేయాలి అని చెప్పేంత గొప్పగా చేసి మెప్పించారు ఎన్టీఆర్.దేవుడు పాత్రలో చేసిన ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే జనాలు థియేటర్ల ముందు బారులు తీరేవారు లవకుశ, దాన వీర శూర కర్ణ లాంటి సినిమాలు ఆయన లోని నటన ప్రతిభ ను బయటకు తీసిన సినిమాలు.

అయితే అలానే బుల్లితెరపై కూడా చాలామంది ఆర్టిస్టులు వాళ్ల వాళ్ల ప్రతిభను నిరూపించుకున్నారు కొన్ని క్యారెక్టర్స్ వాళ్లే చేయాలి మిగతావారు చేయలేరు అనేంతగా ఆ క్యారెక్టర్ లో జీవించేవారు.అలాంటి ఆర్టిస్ట్ ఎవరంటే అరుణ్ గోవిల్.

ఈయన కూడా బుల్లితెరపై రాముడు పాత్రలు చేసి రాముడు అంటే ఇలాగే ఉంటాడు అని బుల్లితెర పై నటించి అభిమానులను మెప్పించిన ఆర్టిస్ట్.ఈయన ఉత్తర ప్రదేశ్ లోని మీరాట్ లో జన్మించాడు ఈయన ముందు నుంచే స్టేజ్ ఆర్టిస్టుగా ఉన్నారు ఆ తర్వాత ముంబై వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి తర్వాత యాక్టింగ్ చేయడం ప్రారంభించారు.

ఈయన 1958 లో జన్మించారు.అప్పట్లో ఈయన నటుడు అయిన తర్వాత బుల్లితెరపై టోటల్ ఇండియా లో రాముడు పాత్ర వేసిన ఆర్టిస్ట్ అలాగే విశ్వామిత్ర సీరియల్లో హరిశ్చంద్ర మహారాజు గా, బుద్ధ సీరియల్లో గౌతమ్ బుద్ధ పాత్రను కూడా చేశాడు రామానంద సాగర్ లో రాముని పాత్ర కూడా చేశాడు.

హిందీ, భోజ్ పూరి,ఒరియా, తెలుగు లో సినిమాలను కూడా చేశాడు లవకుశ సినిమాలో లక్ష్మణుడి పాత్ర చేశాడు.ఈయన ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు తక్కువగానే వచ్చింది.

వెండితెరపై తను అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినప్పటికీ బుల్లితెరపై దేవుడు పాత్రలు వేయాలంటే ఈయనే వేసేవారు.సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నాగార్జున అతిలోక సుందరి శ్రీదేవి తో అయిన తీసిన గోవింద గోవింద మూవీ లో ఈయన వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించారు.

Telugu Arun Govil, Bollywood, Ramananda Sagar, Vijay Govil-Telugu Stop Exclusive

అరుణ్ గోవిల్ అన్నయ్య అయిన విజయ్ గోవల్, చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తబాస్సుని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈమె బాలీవుడ్ లో మొట్టమొదటి టాక్ షో నీ దూరదర్శన్ లో స్టార్ట్ చేసి నడిపించింది.అరుణ్ గోవిల్ చాలామంది ఆర్టిస్ట్ లకు టాలెంట్ ఉన్నప్పటికీ ఏమో కారణాలవల్ల వెండితెరపై పెద్దగా రాణించలేకపోయారు అలాంటివారు తెలుగులో కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ నిరాశ పడకుండా తమకంటూ ఓ గుర్తింపును సాధించడం కోసం బుల్లితెరను ఆసరాగా చేసుకుని చాలా సీరియల్స్ లో మంచి మంచి పాత్రలు చేస్తూ తనకంటూ తాము గుర్తింపును తెచ్చుకుంటున్నారు.ఒకరకంగా వీళ్లు వెండితెరపై అవకాశాలు లేకపోయినా ఎక్కడ నిరుత్సాహపడకుండా తాము నమ్ముకుని వచ్చిన నటన గాని కళామతల్లి గాని ఎక్కడ మోసం చేయొద్దని నమ్మకంతో వెండి తెరపై సక్సెస్ కాలేకపోయినా బుల్లితెరపై అనేక వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వాళ్లకు మంచి గుర్తింపు సాధించుకుంటున్నారు.అరుణ్ గోవిల్ లాంటి వారే కాకుండా ఇంకా చాలామంది మంచి మంచి పాత్రలు పోషిస్తూ రోజు ప్రేక్షకుల ఇళ్లల్లో టీవీ పై మాయ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube