ఎన్ఆర్ఐ అల్లుళ్ల బాగోతాలు రోజురోజుకు బయటికి వస్తూనే ఉన్నాయి.తాజాగా పంజాబ్( Punjab ) మూలాలున్న కెనడా పౌరుడు పంకజ్ ధరణి( Pankaj Dharni ) తన భార్యను కట్నం( Dowry ) కోసం వేధించిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జనవరి 31, 2024న హిందూ సాంప్రదాయంలో పంకజ్‌ను వివాహం చేసుకున్నారు నితికా శర్మ.( Nitika Sharma ) వివాహ సమయంలో పంకజ్, అతని కుటుంబం నితిక తల్లిదండ్రుల నుంచి నగదు, విలువైన వస్తువులు, ఇతర కట్న కానుకలు డిమాండ్ చేశారని పెళ్లిని ఓ విలాసవంతమైన భవనంలో నిర్వహించాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.
వివాహం తర్వాత నితిక తన అత్తమామలతో కలిసి చండీగఢ్‌లో నివసించింది.ఈ సమయంలో నితికకు చెందిన నగలు, గృహోపకరణాలు వంటి విలువైన వస్తువులను లాక్కొన్నారు.పంకజ్ గతేడాది మార్చి 2న కెనడాకు( Canada ) వెళ్లి చిన్న చిన్న విషయాలకే నితికతో గొడవ పెట్టుకునేవాడు.పంకజ్ తల్లిదండ్రులు కూడా కట్నం సరిపోలేదని ఆమెను వేధించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.2024 జూన్‌లో నికితను కెనడాకు తీసుకెళ్లడానికి బదులు అత్తమామలు ఆమెను ఖన్నాలోని తల్లిదండ్రుల ఇంట్లో దించారు.పంకజ్ ఇటీవల ఇండియాకు వచ్చినప్పుడు కూడా నితికను తన ఇంట్లోకి రావడానికి అనుమతించలేదు.
తనపై వేధింపులు తీవ్రంగా కావడంతో నితిక పోలీసులు ఆశ్రయించి భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది.

ఇకపోతే.గడిచిన ఐదేళ్లలో విదేశాలలో తమ జీవిత భాగస్వాములు తమను విడిచిపెట్టారని ఆరోపిస్తూ ఎన్ఆర్ఐ మహిళల నుంచి దాదాపు 1617 ఫిర్యాదులు వచ్చినట్లు ఇటీవల భారత ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియజేసింది.రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
విదేశాలలో నివసిస్తున్న వివాహిత ఎన్ఆర్ఐ మహిళలు ఎదుర్కొంటున్న గృహ హింస, వేధింపులు, ఇతర వైవాహిక వివాదాల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి అన్నారు.

ఈ తరహా కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పరిష్కరిస్తాయని కీర్తి వర్ధన్ చెప్పారు.విదేశాల్లోని భారతీయ మిషన్ల ద్వారా బాధిత మహిళలకు కౌన్సెలింగ్, సమాచారాన్ని అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.తమ అధికార పరిధిలోని ప్రాంతాలలో భారతీయ సంఘాలు, ఎన్‌జీవో సభ్యులతోనూ క్రమం తప్పకుండా తమ మిషన్లు టచ్‌లో ఉన్నాయని ఓపెన్ హౌస్ సమావేశాల ద్వారా కూడా వారి ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని కీర్తి వర్థన్ తెలిపారు







