తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే… ప్రస్తుతం అక్కినేని అఖిల్( Akkineni Akhil ) లాంటి హీరో అయితే మాస్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం.చేస్తున్నాడు.
ప్రస్తుతం తన తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు.అక్కినేని ఫ్యామిలీ మొదటి నుంచి కూడా క్లాస్ సినిమాలను చేస్తూ మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నారు.

ఆ తర్వాత మాస్ సినిమాలు చేశారు.అఖిల్ సైతం మొదట క్లాస్ మూవీస్ చేసినప్పటికి ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.దాంతో ఇప్పుడు ఆయన భారీ విజయాన్ని అందుకోవడానికి మాస్ అవతారం ఎత్తి సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు అందరితో పోటీ పడాలంటే మాత్రం ఆయన భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇప్పటివరకు అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లాంటి హీరో సైతం స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకుంటు ముందుకు దూసుకెళ్తుంటే ఈయన మాత్రం ఒక్క సక్సెస్ ను సాధించలేకపోతున్నాడు.నిజానికి అఖిల్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు.కానీ అతని కంటే ముందు వరుసలో అఖిల్ ముందుకు దూసుకెళ్తున్నాడు.మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ లేదు కానీ ఇండస్ట్రీకి వచ్చి కూడా తన సత్తాను చాటుకోలేకపోతున్న అఖిల్ ను చూసిన చాలా మంది అక్కినేని అభిమానులు సైతం కొంతవరకు నిరాశ చెందుతున్నారనే చెప్పాలి…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
.