కౌసల్య తనయ రాఘవ మూవీ రివ్యూ!

80ల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు ఇప్పటి వరకు చాలానే విడుదల అయ్యి మంచి సక్సెస్ ని సాధించాయి.అలా తాజాగా కూడా మరో సినిమా రూపొందింది.

 Kausalya Tanaya Raghava Movie Review, Kausalya Tanaya Raghava Movie,kausalya Tan-TeluguStop.com

ఆ సినిమా మరేదో కాదు కౌసల్య తనయ రాఘవ.ఈ సినిమా తాజాగా విడుదల అయ్యింది.మరి ఈ సినిమా ఎలా ఉంది? అసలు సినిమా కథ ఏమిటి? ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఈ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కథ:


ఫ్లాష్ బ్యాక్ లో ఒక వ్యక్తి తన భార్యకు తన తాతకు సంబంధించిన కథను చెప్పడంతో ప్రారంభం అవుతుంది ఈ మూవీ.80ల నాటి నేపథ్యంలో ఒక గ్రామంలో బడుగు వర్గానికి చెందిన కౌసల్య (సునీతా మనోహర్) కుమారుడు రాఘవ (రాజేష్ కొంచాడా) ఒక కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు.అదే గ్రామంలో ఉండే పెద్దింటి అమ్మాయి కావ్య (శ్రావణి శెట్టి) అదే కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది.వీళ్లిద్దరు ప్రేమించుకుంటారు.కులాలు వేరే కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వీరి ప్రేమకు అడ్డు చెబుతారు.మరోవైపు అదే కాలేజీలో రాఘవను వ్యతిరేకంగా ఒక గ్యాంగ్ వీళ్ల ప్రేమను పెద్దలకు తెలియజేసేలా చేసి పంచాయితీ పెట్టి వారిద్దరు భవిష్యత్తులో కలుసుకోకుండా చేస్తారు.

ఈ క్రమంలో కావ్యకు ఇంట్లో వాళ్లు ఒక సంబంధం చూస్తారు.చివరికి ఏం జరిగింది.

రాఘవ కావ్యల పెళ్లి జరిగిందా లేదా? ఈ ప్రేమ వ్యవహరంలో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఈ విషయాలు అన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:


Telugu Kausalyatanaya, Review-Movie

కులాలాంతరంతో విడిపోయిన ప్రేమికులు చివరకు ఎలా కలిసారు.చివర్లో హీరో తల్లి ఆశయమైన చదువును పూర్తి చేస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని దర్శకుడు చెప్పడం బాగుంది.చివర్లో ఊర్లో ప్రజలు కులా మతాలకు అతీతంగా ఉండాల్సిన వాళ్లు చిన్నా పెద్ద కులాల అంతరంతో ఎలా విడిపోతున్నారనే విషయాన్ని ఒక క్యారెక్టర్ తో చివర్లో చెప్పించడం బాగుంది.ఇక హీరో చివర్లో విలన్ తండ్రిని కాపాడి అతనిలో పరివర్తన తీసుకు రావడం వంటి అంశాలను దర్శకుడు బాగానే రాసుకున్నాడు.

అలాగే కొత్తవాళ్లతో మంచి నటనే రాబట్టుకొన్నాడు డైరెక్టర్.సినిమాను ఇంకా అరగంట తగ్గించినా పెద్దగా పోయేదేమి లేదు.మధ్యలో టైలర్ పాత్రలో రంగస్థలం మహేష్ తో సైజులు, కొలతలు వంటి బూతు కామెడీ కొంచెం ఇబ్బంది పెడుతుంది.

సాంకేతికత:


Telugu Kausalyatanaya, Review-Movie

సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.ఎడిటర్ తన కత్తెరకు పెద్దగా పనిచెప్పలేదనే విషయం బాగా తెలుస్తోంది.

ముఖ్యంగా కులాల అంతరం కన్నా మనిషికి మానవత్వమే ముఖ్యమనే విషయాన్ని బాగా చెప్పాడు దర్శకుడు.కెమెరా వర్క్స్ బాగున్నాయి.

నటీనటుల పనితీరు:


Telugu Kausalyatanaya, Review-Movie

రాజేష్ కుంచాడా విలేజ్ అబ్బాయి రాఘవ పాత్రకు బాగా న్యాయం చేసాడు.అలాగే మూవీ చూస్తున్నంత సేపు క్యారెక్టర్ కనపడింది.నటుడిగా కూడా మంచి ఎక్స్ ప్రేషన్స్ పలికించాడు.హీరోయిన్ శ్రావణి శెట్టి క్యూట్ నటనతో బాగా ఆకట్టుకుంది.ఎక్కడా అతి లేదు.ఇక హీరో అమ్మ పాత్రలో నటించిన సునీతా మనోహర్ తన పాత్రలో జీవించేసింది అని చెప్పాలి.మరోవైపు బోస్ తాత, కాలేజీ విలన్ గ్యాంగ్ పాత్రలో నటించిన నటుడు సహా ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.

రేటింగ్ : 3/ 5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube