తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సీనియర్ నటి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయశాంతి ( MLA Vijayashanti )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు విజయశాంతి.
ఇకపోతే విజయశాంతి నటించిన లేటెస్ట్ సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి( Arjun Son of Vyjayanthi ).ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు.ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది.ఆ సంగతి పక్కన పెడితే.తాజాగా విజయశాంతి దంపతులు పోలీసులను ఆశ్రయించారు.అసలేం జరిగిందంటే.
విజయశాంతి దంపతులను బెదిరిస్తోన్న చంద్రశేఖర్ ( Chandrasekhar )అనే వ్యక్తిపై బంజార హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

తమను చంపుతామని బెదిరిస్తున్నాడని, తమ అంతు చూస్తామని చంద్ర కిరణ్ రెడ్డి మెసేజ్స్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్.( Srinivas Prasad.) తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ పరువు బజారు కీడుస్తానని ఇద్దరిని చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ విజయశాంతి దంపతులు పోలీసులను ఆశ్రయించారు.
ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న విషయం తెలిసిందే.విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు కొన్నిరోజుల క్రితం చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.
తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పడంతో విజయశాంతి అకౌంట్ మెయిన్ టైన్ చేయాలని శ్రీనివాస్ కోరారు.

కొన్ని రోజుల పాటు విజయశాంతి గురించి ప్రచారం చేయాలని పనితీరు నచ్చితే కాంట్రాక్ట్ చేసుకుందామని చెప్పారు.ఆ సమయంలో అతడికి కొద్ది మొత్తంలో అందజేశారు.కానీ అతడి పనితీరు నచ్చకపోవడంతో అతడిని ఆఫీస్ నుంచి పంపించారు.
దీంతో కొన్నాళ్లు సైలెంట్ అయిన చంద్రశేఖర్ ఇప్పుడు శ్రీనివాస్ ప్రసాద్ కు మెసేజ్ చేస్తూ డబ్బులు పంపించాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడట.అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే విజయశాంతి దంపతులకు చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడట.
తమ పరువు తీస్తానని ఇద్దరిని చంపేస్తానని మెసేజ్స్ చేస్తున్నాడని శ్రీనివాస్ ప్రసాద్ పోలీసులను ఆశ్రయించడంతో చంద్ర కిరణ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.







