చిరంజీవి సినిమా ఇండస్ట్రీ కి రాక ముందు ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు అనే విషయం మన అందరికి తెలుసు.అయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు.
చిరంజీవి చిన్నతనం అంత కూడా అక్కడే జరిగింది.ఇక సినిమా ఇండస్ట్రీ పైన ప్రేమతో చెన్నై కి వెళ్లడం, అక్కడ ఎన్నో కష్టాలకు ఓర్చి సినిమాల్లో అవకాశాలు సంపాదించుకొని నేడు మెగా స్టార్ గా ఎదగడం చూసాం.
అయితే ఇదే మొగల్తూరు నుంచి చిరంజీవి కన్నా ముందే మరొక హీరో వచ్చాడు.అతడే రెబల్ స్టార్ కృష్ణం రాజు.
కృష్ణ రాజు తండ్రి, తాత అంత కూడా మొగల్తూరు వారే.ఇక చిరంజీవి తండ్రి మరియు తాత తో కృష్ణం రాజు తండ్రి కి మరియు తాతకు మంచి సంబంధాలు ఉండేవి.
చిరంజీవి పుట్టక ముందు నుంచి ఈ రెండు కుటుంబాలు మంచి సంబంధాలని కలిగి ఉండేవి.అయితే ఈ విషయాలన్నీ కూడా రెబల్ స్టార్ కృష్ణం రాజు ఒక ఇంటర్వ్యూ లో షేర్ చేసారు.
చిరంజీవి తాత కు సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ని కూడా పంచుకున్నారు కృష్ణం రాజు.చిరంజీవి తాతకు భూతులు మాట్లాడం బాగా అలవాటు ఉండేదట.అకారణంగా ఎవరిని పడితే వారిని ఎక్కువగా భూతులు మాట్లాడుతూ ఉండటం తో ఆయనను ముద్దుగా భూతుల నాయుడు అని పిలుచుకునే వారట.

ఇక అయన అప్పట్లో ఎదో చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అవ్వడం తో కృష్ణం రాజు తాత గారు చిరంజీవి తాతకు మొగల్తూరు లోని సంతలో ఒక షాప్ పెట్టించారట.ఆ తర్వాత ఆ భూతుల నాయుడు కొడుకు వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్ అయ్యాడు.ఆ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు మెగా స్టార్ అయ్యాడు.
అతడితో పాటు పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, నిర్మాతలు, ఎందరో నటులు పుట్టుకచ్చారు.కానీ కృష్ణం రాజు లేదా తన కుటుంబంలో ఎవరు కూడా చిరంజీవి కి ఏమి చేయలేదని అతడి కష్టపడి పైకి వచ్చాడని కృషం రాజు తెలిపాడు.
ఇలా ఇద్దరు పెద్ద హీరోలు ఇచ్చిన మొగల్తూరు కి చిరంజీవి మరియు కృష్ణం రాజు అంటే మాత్రం ఎనలేని అభిమానం ఉంటుంది.వీరికి సైతం సొంత ఊరి పైన అభిమానం మెండుగా ఉంటుంది.