ఆడవారికి అందం అంటే చాలా ఇష్టం.ఒకరకంగా చెప్పాలంటే అందం కోసం ఏమి చేయటానికి అయినా సిద్ధంగా ఉంటారు.
అందం కోసం ఎక్కువగా కాస్మొటిక్స్.ఉపయోగిస్తూ ఉంటారు.
దాని కోసం లిప్ స్టిక్, స్కిన్ క్లీనర్, ఐషాడో,లోషన్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు.వాటి వల్ల ఒక్కోసారి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
అటువంటి ఎలర్జీలు వచ్చినప్పుడు ఈ చిట్కాలను పాటిస్తేసరిపోతుంది.
సాధారణంగా కలబంద అనేది ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.
కలబందను ఎన్నో చర్మ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు.కలబంద నుండి జెల్ ని వేరు చేసి కాస్మొటిక్ ఎలర్జీ వచ్చిన ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరినూనెను ప్రతి ఇంటిలో వాడుతూ ఉంటాం.కొబ్బరినూనె కాస్మొటిక్,ఎలర్జీలకు బాగా సహాయపడుతుంది.అలెర్జీ ఉన్న చోట దీన్ని రాస్తే మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.కాబట్టి ఎలర్జీ ఉన్న ప్రాంతాల్లో మీరు మొదట దీన్ని అప్లయ్ చేయండి.
ప్రతి రోజు ఎదో ఒక కాస్మొటిక్ ని వాడుతూనే ఉంటాం.దాంతో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి.
ఐస్ క్యూబ్స్ కాస్మోటిక్ అలర్జీలను దూరం చేయటంలో సమర్ధవంతంగా పనిచేస్తాయి.కాస్మొటిక్ ఎలర్జీ వచ్చిన ప్రదేశంలో ఐస్ క్యూబ్తో రబ్ చేస్తే తగ్గటమే కాకుండా కాస్మొటిక్స్ కారణంగా వచ్చే చికాకును కూడా తగ్గిస్తుంది.