ప్రతి ఒక్కరు ఆర్టీసీ సంస్థ నీ ఎమోషనల్ గా భావించి ఆర్టీసీ కార్గో సర్వీస్ లను ఉపయోగించుకోవాలని,సురక్షితమైన ప్రయాణం కోసం ప్రతి ఒక్కరు ఆర్టీసీ లో ప్రయాణించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలను కోరారు ఖమ్మం జిల్లా కేంద్రంలో నూతన బస్ స్టేషన్ ప్రారంభించి సంవత్సరం అవుతున్న తరుణంలో ఆయన ఖమ్మం బస్ స్టేషన్ నీ ఆకస్మికంగా సందర్శించి,రెండు గంటల పాటు సుదీర్ఘంగా బస్ స్టాండ్ లోని పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తో భేటి అయ్యారు.
అనంతరం బస్ స్టేషన్ లో కలియ తిరుగుతూ ఆర్టీసీ ద్వారా అందుతున్న సేవలతో పాటు, బస్ సర్వీస్ ల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ నీ ఆయన నివాసం లోని క్యాంప్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి కొద్దిసేపు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ఖమ్మం నూతన బస్ స్టేషన్ అధునాతన టెక్నాలజీతో, సకల సౌకర్యాలతో , సదుపాయాలతో రాష్టంలో రోల్ మోడల్ గా బస్ స్టాండ్ నీ నిర్మించారని, దానికి కృషి చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కి ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పట్టుదల,కృషి తో ఖమ్మం బస్ స్టాండ్ నూతన హంగులతో చాలా సౌకర్యం వంతంగా ఏర్పాటు చేశారని అన్నారు, ప్రజలంతా బస్ లని మీ ఊర్లకి వేయమని అడుగుతున్నారని, తప్పకుండా ఆర్టీసీ సేవలను విస్తరిస్తామని, కానీ ప్రజలంతా ఆర్టీసీ బస్ లని ఎక్కాలని, ప్రవేట్ వాహనాలని పక్కన పెట్టి ఆర్ టి సి బస్ సర్వీస్ లని ఉపయోగించాలని అన్నారు.ఉగాది పండుగ పురస్కరించుకొని 65 సంవత్సరాలు నిండిన వారు ఉగాది సందర్భంగా ఉచితంగా బస్ సౌకర్యం వినియోగించుకోవచ్చు అన్నారు.
వాల్వ బస్ లో 10 రోజులలో అప్ అండ్ డౌన్ ప్రయాణం చేస్తే 20% రాయితీ ఇస్తామని ప్రకటించారు.కార్గో సర్వీస్ లను ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా భావించాలని, బహుమతులను కానీ, వస్తువులను ఒక చోట నుంచి మరో చోటికి పంపించేందుకు సురక్షితమైన కార్గో సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.
అంతే కాకుండా, భద్రాచలం శ్రీరామ నవమి తలంబ్రాలు కార్గో ద్వార అందరూ తెప్పించు కునే లా ప్రత్యేకఏర్పాట్లు చేశామని దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.







