ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.ఎందుకంటే ఆస్తులు ఉన్నవాడు కాదు, ఆరోగ్యం ఉన్నవాడే అదృష్టవంతుడని డాక్టర్లు చెబుతున్నారు.
కోట్ల రూపాయలు ఉన్న ఆరోగ్యంగా లేకుండా ఆ జీవితం నరకంలా అనిపిస్తుంది.కాబట్టి ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.
చాలామంది ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ల దగ్గరికి పరిగెడతారు.కానీ మన ఇంట్లోనే ఉండి కొన్ని వస్తువులతో ఆ సమస్యలు తీరిపోతాయని ఎవ్వరు కూడా తెలుసుకోలేరు.
అలాంటి ఔషధ గుణాలు ఉన్న వాటిల్లో చిట్టీ ఆవాలు( Mustard ) కూడా ఉన్నాయి.వీటితో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఆవాలను దోరగా వేయించుకుని బెల్లాన్ని( Jaggery ) ఆవాలకు సమానంగా కలుపుకొని ముద్దగా చేసుకోవాలి.బఠానీ గింజలంత మాత్రలుగా చేసి నిల్వ చేసుకోవాలి.వీటిని పూటకు ఒకటి చొప్పున తీసుకుంటే నీళ్ల విరోచనాలు, జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive problems ) కూడా తగ్గిపోతాయి.దాంతో పాటు ఆవాలకు బోధకాలను ధరించే గుణం కూడా ఉంటుంది.
చాలామందికి ఈ విషయం తెలియదు.అలాగే అవాలకు తోడు ఉమ్మెత్త ఆకులు, ఆముదపు చెట్టు వేర్లు, మునగ చెట్టు బెరడు వీటన్నిటిని సమానంగా తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరాలి.
ఇలా చేసుకున్న మిశ్రమాన్ని బోధకాలు ఉన్న దగ్గర కట్టుకోవాలి.

శుభ్రమైన గుడ్డలో ఈ మిశ్రమాన్ని కట్టుకుంటే క్రమంగా వాపులు తగ్గిపోతాయని నిపుణులు చెబుతారు.దీనికి ఇంకో మార్గం కూడా ఉంది.అదేంటంటే ఆవాలను మెత్తగా నూరుకొని ముక్కు దగ్గర వాసన తగిలేటట్టు ఉంచుకోవాలి.
ఇలా చేయడం వలన మూర్ఛ వల్ల స్పృహ కోల్పోయిన వారికి వెంటనే మెలుకువ వస్తుంది.ఇక ఆవాలను నూనెగా మార్చుకుని ఇందులో నుంచి 50 గ్రాముల ఆవనూనె( Mustard Oil ) నల్ల తుమ్మ చెట్టు పూలు 20 గ్రాములు మోతాదులో తీసుకోవాలి.
ఆ తర్వాత దాన్ని వడగట్టుకుని నిల్వ చేసుకోవాలి.దీన్ని చెవిలో నుంచి చీమ లాంటివి కారితే రెండు పూటలా మూడు నుండి నాలుగు చుక్కల మోతాదులో వేస్తే సరిపోతుంది.
దీనివల్ల చెవులు శుభ్రంగా ఉంటాయి.