దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి.
అలాంటి దర్శక ధీరుడి తో సినిమా చేయడానికి దేశం మొత్తం మీద ఉన్న అందరు స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నారు.అయితే రాజమౌళి తన కెరియర్ లో తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాల్ని అందుకున్నాయి.
రాజమౌళి కెరియర్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలనీ బాగా ట్రై చేసాడు కానీ వీలుకాలేదు.రాజమౌళి తన కెరియర్ లో బెస్ట్ సినిమా గా చెప్పుకునే విక్రమార్కుడు సినిమా పవన్ కళ్యాణ్ తో చేయాలనీ అనుకుని అతనికి కథ కూడా చెప్పే ప్రయత్నం లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాల దాక బిజీ గా ఉన్నాడని తెలుసుకొని ఆ సినిమాని రవి తేజ తో తీసాడు అలా పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబినేషన్ లో రావాల్సిన సినిమా మిస్ అయింది…ఈ కాంబినేషన్ లో కనక సినిమా వచ్చి ఉంటె అది చాలా రికార్డులు క్రియేట్ చేసేది.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు ఇది పాన్ వరల్డ్ సినిమా గా తెరకెక్కుతుందనే విషయం తెలుస్తుంది.ఈ సినిమా తో మహేష్ బాబు వరల్డ్ వైడ్ గా ఫేమస్ అవుతాడు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ అయిపోగానే రాజమౌళి సినిమాలో జైన్ అవుతాడు.
రాజమౌళి తన కెరియర్ లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేకుండా అన్ని సినిమాలు హిట్ కొట్టడడం అనేది అంత ఈజీ కాదు.ఇండస్ట్రీ లో ఒక్క హిట్ కొడితే చాలు అనుకునే డైరెక్టర్స్ ఉన్నారు అలాంటిది చేసిన అన్ని సినిమాలు మంచి హిట్స్ కొట్టాయి అంటే రాజమౌళి ఒక సినిమా కోసం ఎంత కష్టపడతాడు అనే విషయం మనకు తెలుస్తుంది…
.