ప్రస్తుత వింటర్ సీజన్ లో పెదాలు తరచూ డ్రైగా మారిపోతుంటాయి.ఇలా పొడిబారిపోవడం వల్ల పెదాలు రంగు తగ్గడమే కాదు కాంతిహీనంగా సైతం మారుతుంటాయి.
ఈ క్రమంలోనే పెదాలను మళ్లీ మామూలు స్థితిలోకి తెచ్చుకోవడం కోసం తోచిన చిట్కాలు పాటిస్తుంటారు.అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలీక ఆగమాగం అయిపోతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.అయితే అస్సలు వర్రీ అవకండి.
ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ లిప్ బామ్ ను కనుక వాడితే పెదాలు మృదువుగా మరియు ఎర్రగా మారడం ఖాయం.
మరి ఇంతకీ ఆ లిప్ బామ్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక పెద్ద బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో బీట్ రూట్ జ్యూస్ ను వేసుకోవాలి.
చిన్న మంటపై స్పూన్‌తో తిప్పుకుంటూ బాగా ఉడికించాలి.బీట్ రూట్ జ్యూస్ దగ్గర పడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా ఉడికించిన మిశ్రమం పూర్తిగా చల్లారితే మన లిప్ బామ్ సిద్ధమవుతుంది.ఈ లిప్ బామ్‌ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజుకు రెండు నుంచి మూడు సార్లు పెదాలకు ఈ లిప్ బామ్ ను అప్లై చేసుకుంటూ ఉండాలి.ఇలా చేస్తే బీట్ రూట్ మరియు నెయ్యిలో ఉండే ప్రత్యేక గుణాలు పొడిబారిన పెదాలను తేమగా మరియు మృదువుగా మారుస్తాయి.నలుపును వదిలించి పెదాలను ఎర్రగా అందంగా మారుస్తాయి.వింటర్ సీజన్ లో ఎర్రటి మృదువైన మెరిసేటి పెదాలను కోరుకునే వారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ లిప్ బామ్ ను వాడేందుకు ప్రయత్నించండి.