టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.
మొన్నటి వరకు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ.ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఏడాదిలోనే ఏకంగా ఐదు సినిమాలను రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచింది రకుల్ ప్రీత్ సింగ్.ఇక ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు జాకీభగ్నానితో ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే.
ఇదే విషయాన్ని గత ఏడాది ఆమె అధికారికంగా ప్రకటించింది.గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలలో బిజీ బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ లు తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసినప్పటి నుంచి పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు రకుల్ ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నాని పుట్టినరోజు కావడంతో బాయ్ ఫ్రెండ్ కి స్పెషల్గా విషెస్ తెలిపింది.

ఈ నేపథ్యంలోనే ఒక రొమాంటిక్ ఫోటోని కూడా విడుదల చేసింది.ఆ ఫోటోలో తన ప్రియుడిని ప్రేమగా హత్తుకుంది.శాంటా నా జీవితానికి ఉత్తమమైన బహుమతిని అందించాడు.
అది నువ్వే.ఈరోజు మై లవ్ జాకి భగ్నాని పుట్టినరోజు కావడం సంతోషంగా ఉంది.
ఎప్పటికీ నీ వెంటే ఉంటాను.అలాగే నువ్వు కోరుకుంటున్నవని నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను.
నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను అని ప్రేమగా శుభాకాంక్షలు తెలిపింది రకుల్.అయితే ఈ మధ్యకాలంలో ఈమె టాలీవుడ్ సినిమాలలో నటించడం లేదు ఎక్కువగా బాలీవుడ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది.
ముంబై ఢిల్లీలోనే ఉంటూ అక్కడే సినిమాలు చేస్తూ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంది రకుల్ ప్రీత్ సింగ్.అంతేకాకుండా సినిమాలలో కూడా బిజీ బిజీగా గడుపుతోంది.







