నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బింబిసారా.టైం ట్రావెల్ కథ నేపథ్యంలో తెరకేక్కిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు.
ఈ సినిమా ద్వారా వశిష్ట అనే కొత్త దర్శకుడుని కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లో విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.
ఇలా చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ ఖాతాలో మంచి హిట్ సినిమా పడిందని చెప్పాలి.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయంలో నటించగా కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు.
ఇక థియేటర్లో ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరలకు సినిమా హక్కులను కొనుగోలు చేసింది.ఇక ఈ సినిమాని దీపావళి కానుకగా జీ 5 లో ప్రసారం చేయడంతో ఇక్కడ కూడా ఎంతో మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఇలా థియేటర్లోనూ, ఓటీటీలోనూ ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సరం కానుకగా జీ చానల్లో ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు.ఇలా థియేటర్లోనూ ఓటీటీలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న బింబిసారా చిత్రం టెలివిజన్ లో ప్రసారమవుతు ఎలాంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.







