అమెరికాలో( America ) అక్రమంగా నివసిస్తున్న భారతీయులను( Indians ) అక్కడి ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా 200 మంది భారతీయుల బృందంతో కూడిన అమెరికా సైనిక విమానం బుధవారం ఉదయం 9 గంటలకు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దిగనుంది.
వీరిలో ఎక్కువ మంది పంజాబ్( Punjab ) ఇతర రాష్ట్రాలకు చెందినవారే.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే మొదటి బహిష్కరణ.
అక్రమంగా అమెరికాలో ఉంటోన్న భారతీయులను తరలించడానికి యూఎస్ మిలిటరీ సీ -17 గ్లోబ్ మాస్టర్ సైనిక విమానాన్ని ఉపయోగిస్తోంది.ఇది అమృత్‌సర్‌లో దిగే ముందు జర్మనీలోని రామ్ స్టెయిన్ వైమానిక స్థావరంలో ఇంధనం నింపుకోనుంది.
అక్రమ వలసదారులను( Illegal Migrants ) భారత్‌కు తిప్పి పంపేందుకు అమెరికా ప్రభుత్వం సైనిక విమానాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి.గతంలో భారతీయులను బహిష్కరించినప్పుడు వాణిజ్య విమానాల ద్వారానే వలసదారులను పంపేది.

ఈ బహిష్కరణపై న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ.యూఎస్ తన సరిహద్దులను తీవ్రంగా అమలు చేస్తోందని, వలస చట్టాలను కఠినతరం చేస్తోందన్నారు.అక్రమ వలసదారులను బహిష్కరించడం ద్వారా తమ ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని పంపుతోందన్నారు.గతేడాది నవంబర్‌లో బహిష్కరణకు గురైన 18 వేల మంది అక్రమ వలసదారుల జాబితాను భారత ప్రభుత్వంతో అమెరికా పంచుకుంది.

భారతదేశం అక్రమ వలసలను సమర్ధించదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్( MEA S Jai Shankar ) ఇప్పటికే స్పష్టం చేశారు.కేవలం చట్టపరమైన చలనశీలతకు మాత్రమే తమ ప్రభుత్వం మద్ధతు ఇస్తుందని ఆయన తెలిపారు.కాగా.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వలస ఎజెండాను అమలు చేయడంలో సహాయం కోసం సైన్యాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.అలాగే వలసదారులను బహిష్కరించడానికి సైనిక విమానాలను ఉపయోగించడం , వారికి వసతి కల్పించడానికి సైనిక స్థావరాలను తెరవడం వంటివి ఇందులో ఉన్నాయి.