టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) ఒకరు.ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ప్రభాస్ ప్రస్తుతం కల్కి, సలార్ సీక్వెల్ సినిమాలతో పాటు ఫౌజీ,( Fauji ) రాజా సాబ్,( Rajasaab ) స్పిరిట్( Spirit ) వంటి సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇకపోతే ప్రభాస్ ఇప్పటివరకు పోలీస్ పాత్రలో నటించలేదు కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ఈయన చేయబోతున్న స్పిరిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.ఇలా ఇప్పటికే ఎన్నో విభిన్నమైన పాత్రలలో కనిపించిన ప్రభాస్ డాక్టర్( Doctor ) గా మాత్రం కనిపించలేదు.ఇకపై అలాంటి పాత్రలలో కూడా కనిపించరని తెలుస్తోంది.ప్రభాస్ కి డాక్టర్ పాత్రలో( Prabhas Doctor Role ) నటించడం ఏమాత్రం ఇష్టం ఉండదట.

డాక్టర్ పాత్రలో నటించాలి అంటే ప్రభాస్ ఆమడ దూరం ఉంటారని తెలుస్తోంది.ఎందుకంటే అందులో ఆయన ట్రీట్మెంట్ చేయడం సిరంజ్ పట్టుకొని ఇంజక్షన్స్ చేయడం లాంటివి అతనికి కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తాయని అందుకే ఇప్పటివరకు డాక్టర్ పాత్రలో నటించని ప్రభాస్ ఒకవేళ పాత్ర డిమాండ్ చేస్తే నటిస్తానని కానీ కాస్త భయం ఉంటుందని తెలిపారు.చిన్నప్పటి నుంచి ఇంజక్షన్ అనే ఫోబియా ఉండటంవల్లే ప్రభాస్ డాక్టర్ పాత్రలకు దూరంగా ఉన్నారట.ఇక ఈ ఏడాది ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.
డైరెక్టర్ మారుతి( Maruthi ) దర్శకత్వంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.