న్యూస్ రౌండప్ టాప్ - 20

1.దిశ ఎన్ కౌంటర్ పై హైకోర్ట్ లో విచారణ వాయిదా

దిశ ఎన్ కౌంటర్ కు సంబందించి  హై కోర్ట్ లో విచారణ వాయిదా పడింది.ఎన్ కౌంటర్ కు గురైన బాధితుల తరపున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా కార్వెల్ వాదనలు వినిపించారు. 

2.బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ పై ఈడి కి ఫిర్యాదు

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ka Paul, Kodali Nani, Jogi Ramesh, Mpj

బీఆర్ఎస్ ఎంపీ జొగినపల్లి సంతోష్ కుమార్ పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు.హరితహారం కార్యక్రమం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద కుంభకోణానికి పాల్పడిందని సంతోష పై ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

3.జగన్ పై బుచ్చయ్య కామెంట్స్

  చంద్రబాబు హయాంలో 54 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వలేదని సీఎం జగన్ నిరూపిస్తే టిడిపిని రద్దు చేస్తామని,  తన సవాల్ కు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అంటూ జగన్ ను ఉద్దేశించి టిడిపి రాజమండ్రి ఎంపీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. 

4.ఢిల్లీ కి 50 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ka Paul, Kodali Nani, Jogi Ramesh, Mpj

దేశ రాజధాని నగరమైన ఢిల్లీకి కొత్తగా 50 ఎలక్ట్రిక్ బస్సులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ తీసుకువచ్చారు వీటిని ఆయన ప్రారంభించారు. 

5.జోగయ్య దీక్షకు మచిలీపట్నంలో కొనసాగింపు

  కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలంటూ మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య చేపట్టిన దీక్షకు కొనసాగింపుగా మచిలీపట్నంలో కాపు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కొట్టే వెంకట్రావు దీక్షకు దిగారు. 

6.రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ka Paul, Kodali Nani, Jogi Ramesh, Mpj

జూబ్లీహిల్స్ లోని తన నివాస నుంచి టీపీసీసీ రేవంత్ రెడ్డి ధర్నా చౌక్ కు బయలుదేరారు.ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో రేవంత్ వాగ్వాదానికి దిగారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. 

7.ఎస్సై కానిస్టేబుల్ రాత పరీక్ష సమయం

  తెలంగాణలో ఎస్సై కానిస్టేబుల్ నియామకాలు సంబంధించిన రాత పరీక్ష షెడ్యూల్ ఖరారు అయింది.మార్చి 12 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. 

8.కె ఏ పాల్ కామెంట్స్

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ka Paul, Kodali Nani, Jogi Ramesh, Mpj

బీఆర్ఎస్ లో చేరే నాయకులపై ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ సెటైర్లు వేశారు.డబ్బులకు ఆశపడి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరుతున్నారని విమర్శించారు. 

9.ఘనంగా ముక్కోటి ఏకాదశి

  ద్వారకాతిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్న స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. 

10.చంద్రబాబుపై కొడాలి నాని కామెంట్స్

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ka Paul, Kodali Nani, Jogi Ramesh, Mpj

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పై కొడాలి నాని కామెంట్ చేశారు.యమ రథం తో చంద్రబాబు ప్రజలను చంపుతున్నాడని నాని విమర్శించారు. 

11.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 173 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

12.సర్పంచులకు నిధులను విడుదల చేయాలి : ఉత్తమ్

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ka Paul, Kodali Nani, Jogi Ramesh, Mpj

సర్పంచుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని,  నిధులు విడుదల చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని టిపిసిసి మాజీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 

13.నిమ్స్ లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్

  సీనియర్ ప్రెసిడెంట్ వైద్యుల పోస్టుల భర్తీకి నిమ్స్ అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేశారు.ఈనెల 7 లోపు అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని నిమ్స్ అధికారులు వెల్లడించారు. 

14.స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించిన హరీష్ రావు

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ka Paul, Kodali Nani, Jogi Ramesh, Mpj

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సందర్శించారు.ఈ సందర్భంగా స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించారు. 

15.నోట్ల రద్దు పై సుప్రీంకోర్టు తీర్పు

  పెద్ద నోట్లు రద్దు సరైనదేనని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 

16.బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ka Paul, Kodali Nani, Jogi Ramesh, Mpj

నేడు టిఆర్ఎస్ లోకి ఏపీ నుంచి భారీగా చేరికలు చోటు చేసుకొనున్నాయి.కేసీఆర్ సమక్షంలో మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ , మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు,  మాజీ ఐఆర్ఎస్ పార్థసారథి తో పాటు మరికొంతమంది నేతలు చేరనున్నారు. 

17.రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలు

  నేటి నుంచి ఆర్జిటి, పిటిసి మైదానంలో రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. 

18.జగన్ తో ఎమ్మెల్యే కోటంరెడ్డి భేటీ

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ka Paul, Kodali Nani, Jogi Ramesh, Mpj

నేడు జగన్ తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భేటీ కానున్నారు.గత కొంతకాలంగా ఆయన ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎంవో నుంచి ఆయనకు పిలుపు అందింది. 

19.చంద్రబాబు ను అరెస్ట్ చేస్తాం : మంత్రి జోగి

 చంద్రబాబు అధికార దాహం ప్రచార పిచ్చి వల్లే అమాయక ప్రజలు మరణించారని, గుంటూరులో తొక్కిసలాట ఘటనలో ముగ్గురు మరణించారని,  ఆయనను ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. 

20.ఈరోజు బంగారం ధరలు

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ka Paul, Kodali Nani, Jogi Ramesh, Mpj

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,450
  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 55,040

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube