ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా పరిచయం అయ్యి చాలా కాలం అయింది.టాలీవుడ్ లో ఈయన పరిస్థితి ఇంకా ముందుకు వెనక్కు అన్నట్లుగానే ఉంది.
ఒక సినిమా పర్వాలేదు అన్నట్లు ఉంటే రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.ఈ సమయం లో బాలీవుడ్ లో ఎంట్రీ కి బెల్లంకొండ హీరో సిద్ధం అయ్యాడు.
అది కూడా ప్రభాస్ హీరో గా రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కి సూపర్ హిట్ సూపర్ హిట్ అయినా చత్రపతి రీమేక్ తో హిందీ లో చత్రపతి రీమేక్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సత్తా చాటాలని భావిస్తున్నాడు.ఈ సినిమా ప్రారంభమై దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది.
అయినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేక పోవడంతో అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హిందీ లో పెన్ స్టూడియో వారు ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
పోయి పోయి ఒక తెలుగు హీరో తో అది కూడా తెలుగు సినిమా రీమేక్ చేయడం ఏంటి అంటూ చాలా మంది హిందీ ఫిలిం క్రిటిక్స్ అనుమానాలు వ్యక్తం చేశారు.
బెల్లం కొండ గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెన్ స్టూడియో వారు ఈ రీమేక్ ని మొదలు పెట్టారా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేశారు.సినిమా షూటింగ్ అయితే మొదలైంది కానీ పూర్తి అవుతుందా.పూర్తి అయిన తర్వాత విడుదలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారీ ఎత్తున బడ్జెట్ ఖర్చు చేసి చత్రపతి సినిమా యొక్క రీమేక్ కచ్చితంగా విడుదల చేయాలని మేకర్స్ కోరుకుంటూ ఉంటారు.మరి ఎప్పుడు విడుదల ఉంటుంది అనేది చూడాలి.
షూటింగ్ ఎక్కడ వరకు వచ్చిందో అనేది యూనిట్ సభ్యులు ప్రకటించాల్సి ఉంది.