మంచి కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా సూపర్ సక్సెస్ అవుతుంది.విక్టరీ కొట్టిన సినిమాలు పలు భాషల్లోకి రీమేక్ అవుతాయి.
అలా తెలుగు సూపర్ హిట్ కొట్టిన పలు తెలుగు సినిమాలు పలు భాషల్లోకి రీమేక్ అయ్యాయి.తెలుగులో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్లుగా నిలిచిన ఈ సినిమాలను ఇతర భాషల్లో రిమేక్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి.తెలుగులో రూపొంది ఐదుకు పైగా భాషల్లోకి రిమేక్ చేయబడ్డ తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
వెంకటేష్ హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 5 భాషల్లోకి రిమేక్ అయ్యింది.తమిళ్ , బెంగాలీ, భోజ్ పురి, కన్నడ, ఒడియా భాషల్లోకి రిమేక్ చేయబడింది.అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.
ఒక్కడు
![Telugu Adavarimatalaku, Maryada Ramanna, Okkadu, Pokiri, Tollywood, Vikramarkudu Telugu Adavarimatalaku, Maryada Ramanna, Okkadu, Pokiri, Tollywood, Vikramarkudu](https://telugustop.com/wp-content/uploads/2021/05/okkadu.jpg )
మహేష్ బాబు హీరోగా, గుణ శేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ తెలుగు సినిమా కూడా 5 భాషల్లోకి రిమేక్ అయ్యింది.తమిళ్ , కన్నడ, బెంగాళీ, హిందీ, ఒడియా భాషల్లోకి రిమేక్ చేయబడి మంచి విజయం సాధించింది.
మర్యాద రామన్న
![Telugu Adavarimatalaku, Maryada Ramanna, Okkadu, Pokiri, Tollywood, Vikramarkudu Telugu Adavarimatalaku, Maryada Ramanna, Okkadu, Pokiri, Tollywood, Vikramarkudu](https://telugustop.com/wp-content/uploads/2021/05/maryada-ramanna.jpg )
సునీల్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ తెలుగు సినిమా సైతం 5 భాషల్లోకి రిమేక్ అయ్యింది.కన్నడ, బెంగాళీ, హిందీ, తమిళ్, మళయాళ భాషల్లోకి రిమేక్ అయి మంచి విజయాన్ని అందుకుంది.
పోకిరి
![Telugu Adavarimatalaku, Maryada Ramanna, Okkadu, Pokiri, Tollywood, Vikramarkudu Telugu Adavarimatalaku, Maryada Ramanna, Okkadu, Pokiri, Tollywood, Vikramarkudu](https://telugustop.com/wp-content/uploads/2021/04/pokiri-puri-jagannadh-pokiri-completed-15-years-tollywood.jpg )
మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా5 భాషల్లోకి రిమేక్ అయ్యింది.తమిళ్ , కన్నడ, బెంగాళీ, హిందీ, ఒడియా భాషల్లోకి రిమేక్ చేయబడింది.అన్ని భాషల్లో మంచి విజయం అందుకుంది.
విక్రమార్కుడు
![Telugu Adavarimatalaku, Maryada Ramanna, Okkadu, Pokiri, Tollywood, Vikramarkudu Telugu Adavarimatalaku, Maryada Ramanna, Okkadu, Pokiri, Tollywood, Vikramarkudu](https://telugustop.com/wp-content/uploads/2021/05/vikramarkudu.jpg )
రవితేజ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 6 భాషల్లోకి రిమేక్ అయ్యింది.కన్నడ, తమిళ్, హిందీ, బెంగాలీ, బంగ్లాదేశ్ బెంగాళీలో 2 సార్లు రిమేక్ చేయబడింది.అన్ని చోట్ల హిట్ కొట్టింది.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
![Telugu Adavarimatalaku, Maryada Ramanna, Okkadu, Pokiri, Tollywood, Vikramarkudu Telugu Adavarimatalaku, Maryada Ramanna, Okkadu, Pokiri, Tollywood, Vikramarkudu](https://telugustop.com/wp-content/uploads/2021/05/nuvvostanante-nenoddantana.jpg )
సిద్దార్థ హీరోగా ప్రభుదేవ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అత్యధికంగా 9 భాషల్లోకి రీమేక్ అయ్యింది.తమిళ్ , కన్నడ, బెంగాళీ, మణిపూరి, ఒడియా, పంజాబీ, హిందీ, బంగ్లాదేశ్, నేపాల్ భాషల్లో రిమేక్ చేయబడింది.అన్నిచోట్ల విజయం సాధించింది.