ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించిన సినిమాలెన్నో తెలుసా?

ఎన్టీఆర్. తెలుగు సినిమా పరిశ్రమలో తీరుగులేని కథానాయకుడు.

 Ntr And His Son Balakrishna Combination Movies, Balakrishna, Ntr, Tollywood, Fat-TeluguStop.com

ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేసి మెప్పించిన మహా నటుడు.టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ.

రాజకీయాల్లో ప్రవేశించి కేవలం 9 నెలల వ్యవధిలో సీఎం అయి రికార్డు సాధించారు.ఇక తన నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ తండ్రి తగ్గ తనయుడిగా అగ్ర హీరోగా రాణిస్తున్నారు.గత 46 ఏళ్లుగా హీరోగానే కొనసాగుతున్న ఏకైక హీరోగా బాలయ్య రికార్డు నెలకొల్పారు.

తాతమ్మ కల

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

1974లో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మ కల సినిమాతో బాలకృష్ణ నటుడిగా తెరంగేట్రం చేసారు.ఈ సినిమాలో బాలయ్య అప్పట్లోనే అద్భుత నటన కనబరిచారు.తండ్రి ఎన్టీఆర్ కాంబినేషన్‌లో బాలయ్యకు ఇది ఫస్ట్ మూవీ.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది.

అన్నదమ్ముల అనుబంధం

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

తండ్రి ఎన్టీఆర్‌తో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం అన్నదమ్ముల అనుబంధం.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.నిజ జీవితంలో తండ్రి కొడుకులైన ఎన్టీఆర్, బాలకృష్ణ ఈ సినిమాలో అన్నదమ్ములుగా నటించడం విశేషం.

వేములవాడ భీమకవి

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

తండ్రి ఎన్టీఆర్‌తో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం వేములవాడ భీమకవి.ఈ చిత్రంలో బాలయ్య టైటిల్ రోల్ పోషించడం విశేషం.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది.

దాన వీర శూర కర్ణ

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన నాల్గో చిత్రం దాన వీర శూర కర్ణ.ఈ చిత్రంలో బాలయ్య అభిమన్యుడు పాత్రలో నటించి మెప్పించారు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించింది.

ఈ చిత్రంలో అన్న ఎన్టీఆర్.శ్రీకృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధునుడిగా మూడు పాత్రల్లో విభిన్నమైన నటన కనబరిచి మెప్పించారు.

అక్బర్ సలీం అనార్కలి

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఐదో చిత్రం ‘అక్బర్ సలీం అనార్కలి’.ఈ చిత్రంలో ఎన్టీఆర్ అక్బర్ పాత్రలో నటిస్తే.బాలయ్య.సలీం పాత్రలో నటించారు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.ఈ చిత్రానికి డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన పాటలు పెద్ద హిట్టైయ్యాయి.

శ్రీ మద్విరాట పర్వము

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఆరో చిత్రం శ్రీ మద్విరాట పర్వము.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణ, అర్జున, దుర్యోధన, కీచకుడు, బృహన్నలగా ఐదు పాత్రలు పోషించారు.బాలయ్య ఈ చిత్రంలో మరోసారి అభిమన్యుడు పాత్రలో నటించాడు.

శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఏడో చిత్రం శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం.ఈ చిత్రంలో ఎన్టీఆర్ వేంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తే.బాలయ్య నారదుడి పాత్రలో నటించారు.

రౌడీ రాముడు కొంటె కృష్ణుడు

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఎనిమిదో చిత్రం రౌడీ రాముడు కొంటె కృష్ణుడు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.

అనురాగ దేవత

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన తొమ్మిదో చిత్రం అనురాగ దేవత.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది.

సింహం నవ్వింది

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన పదో చిత్రం ‘సింహం నవ్వింది’.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన పదకొండో చిత్రం శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర గోల్డెన్ జూబ్లీ సక్సెస్ సాధించింది.

బ్రహ్మర్షి విశ్వామిత్ర

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన పన్నెండో చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర.ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయింది.ఈ చిత్రంతో ఎన్టీఆర్ నటన విమర్శల పాలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube