ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది.దీని ప్రభావం తీవ్రతరం అవడంతో ఎంతమంది మృత్యువాత పడ్డారు.
మరికొందరిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల, సరైన సమయంలో సరైన చికిత్స అందడంతో చాలామంది ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందారు.అయితే కరోనా నుంచి కోలుకున్న వారు మరొక తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
ఇంతకీ ఆ సమస్య ఏమిటి? పరిశోధకులు ఏం చెబుతున్నారు? అన్న విషయాలను తెలుసుకుందాం…
లండన్ ఇంపెరియల్ కాలేజీలో డాక్టర్ Adam Hampshire నేతృత్వంలో జరిగిన పరిశోధనల్లో దాదాపుగా 84 వేల మంది పై అధ్యయనం చేయగా వారిలో కరోనా తీవ్రమైన కేసులలో, కరోనా నుంచి విముక్తి పొందినప్పటికీ కొన్ని నెలల నుంచి వారు తీవ్రమైన మానసిక ఆందోళన చెందుతున్నారని ఈ పరిశోధనల్లో వెల్లడైంది.
అంతేకాకుండా కరోనా నుంచి కోలుకున్న వారిలో మెదడు పనితీరు ఎలా ఉంది? అన్న దానిపై పరిశోధనలు జరిపారు.ఈ పరిశోధనలో భాగంగా కరోనా సోకిన వారిలో మెదడు పనితీరు చాలావరకు తగ్గిపోయిందని, వీరి మనస్తత్వం 10 సంవత్సరాల పిల్లాడిలా మారిపోయిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.అంతేకాకుండా, వీరిలో మతిమరుపు లక్షణాలు ఉన్నాయా? అన్న కోణంలో పరిశోధనలు జరిపి వారిని పదాలను గుర్తించడం, పజిల్ నింపడం వంటి పరీక్షలు నిర్వహించడంతో వారి మెదడు దాదాపుగా బలహీన పడినట్లు తెలియజేశారు.
Great British Intelligence Testతో నిర్వహించిన పరీక్షలలో దాదాపుగా కరోనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరి కోలుకుంటున్న వారిలో ఇరవై ఏళ్ళ వయసు నుంచి దాదాపుగా 70 సంవత్సరాల వయసు కలిగిన వారిలో తీవ్రమైన మానసిక ఆందోళన సమస్యలతో పాటు, వీరి మెదడు పదేళ్ల పిల్లాడి వయసుతో సమానమని తెలియజేశారు.