విజయ లలిత సొంతంగా సినిమాలు చేసిన హీరోయిన్లతో తను ఒకరు.ఈమె నిర్మాతగా దేవుడు మామయ్య అనే సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాకు కె వాసు దర్శకత్వం వహించాడు.శోభన్ బాబు, వాణి శ్రీ హీరో, హీరోయిన్లుగా చేశారు.
ఈ సినిమాలో విజయ లలిత కూడా ఓ కీలక పాత్ర పోషించారు.ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికే పూర్తి అయ్యింది.1980 జనవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు.అనుకున్నట్లుగానే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఈ సమయంలో ఫైనాన్షియల్ విషయాల్లో వివాదాలు తలెత్తాయి.డిస్ట్రిబ్యూటర్స్ కూడా సహకరించలేదు.
విజయలలిత ఎంత ప్రయత్నం చేసినా సినిమా విడుదల కాలేదు.దీంతో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు.
వెంటనే దాసరి నారాయణను కలిసి విషయం చెప్పింది విజయలలిత.
వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరింది.
సినిమా అనుకున్న సమయానికి విడదల అయ్యేలా చూడాలని చెపప్పింది.అప్పుడు దాసరి చాలా బిజీగా ఉన్నాడు.
తన సినిమాలతోనే రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్క్ చేస్తున్నాడు.అయితే విజయ లలిత అభ్యర్థనతో ఫైనాన్షియర్లు, డిస్ర్టిబ్యూటర్స్‌తో మాట్లాడి సెటిల్ చేశారు.
అయితే 1980 జనవరి 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఏడాది ఆలస్యంగా 1981 జనవి 14న విడుదలకు రెడీ అయ్యింది.ఇక సినిమా విడుదల అవుతుంది అనుకున్న సమయంలో మరో అవారంతరం ఏర్పడింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వాణి శ్రీ నిర్మాత మీద కేసు పెట్టింది.తనకు ఈ సినిమాలో నటించినందుకు గాను 80 వేల రూపాయలు ఇస్తామని.కేవలం 30 వేల రూపాయలు ఇచ్చారని చెప్పింది.ఇంకా తనకు రావాల్సిన 50 వేల రూపాయలను ఇచ్చాకే సినిమా రిలీజ్ చేయాలని కోరారు.తీర్పు వచ్చే వరకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి నిర్మాతలకు డబ్బు రాకుండా చూడాలని కోర్టును కోరారు.విజయ లలిత మళ్లీ దాసరి దగ్గరికి వెళ్లారు.
ఆయన వాణిశ్రీతో మాట్లాడి కేసు విత్ డ్రా చేసుకున్నారు.విజయలలితను, వాణిశ్రీని కూర్చోబెట్టి సమస్యను సామర్యంగా పరిష్కరించారు.