ఈ 4 ఆహారాలు డైట్‌లో ఉంటే మీ జుట్టు సేఫ్‌..!

హెయిర్ ఫాల్‌.స్త్రీల‌నే కాదు పురుషుల‌నూ తీవ్రంగా మ‌ద‌న పెట్టే స‌మ‌స్య ఇది.ఈ స‌మ‌స్య‌ను నియంత్రించ‌డం కోసం త‌ర‌చూ హెయిర్ ఆయిల్స్‌, షాంపూస్‌ల‌ను మారుస్తుంటారు.వారానికి రెండు మూడు సార్లు హెయిర్ ప్యాకులు, మాస్క్‌లు వేసుకుంటారు.

 Best Foods For Healthy And Strong Hair! Best Foods, Healthy Hair, Strong Hair, H-TeluguStop.com

అయినా స‌మ‌స్య అదుపులోకి రాకుంటే ఏం చేయాలో అర్థంగాక హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతుంటారు.మందులు సైతం వాడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే నాలుగు ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకుంటే ఎలాంటి మందులు వాడ‌కుండానే హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ఉసిరికాయ‌.ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.జుట్టుకూ ఉసిరి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఉసిరికాయ‌ల పొడి క‌లిపి తీసుకోవాలి.

లేదా ఎండ‌బెట్టిన ఉసిరికాయ ముక్క‌ల‌ను తినాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే మీ జుట్టు సేఫ్‌.ఉసిరికాయ‌ల్లో ఉండే ప్ర‌త్యేక సుగుణాలు జుట్టుకు బ‌లాన్ని చేకూరుస్తుంది.దాంతో హెయిర్ ఫాల్ స‌మ‌స్య దూరం అవుతుంది.వైట్ హెయిర్ త్వ‌ర‌గా రాకుండా ఉంటుంది.

Telugu Tips, Foods, Care, Care Tips, Healthy, Latest-Telugu Health Tips

అలాగే జుట్టు ఆరోగ్యంగా, స్ట్రోంగ్‌గా ఉండాలంటే డైట్‌లో డ్రైఫ్రూట్స్ ను త‌ప్ప‌నిస‌రిగా చేర్చుకోవాలి.ముఖ్యంగా బాదం ప‌ప్పు, వాల్‌న‌ట్స్‌, జీడిప‌ప్పు, పిస్తా ప‌ప్పు వంటి వాటిని తీసుకోవాలి.హెయిర్ ఫాల్‌ను నివారించి జుట్టును ఒత్తుగా, పొడ‌వుగా పెంచ‌డంలో బచ్చలికూర గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, వారంలో రెండు లేదా మూడు సార్లు ఖ‌చ్చితంగా బ‌చ్చ‌లికూర‌ను తినాల‌ని నిపుణులు చెబుతున్నారు.బుచ్చ‌లికూర శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలను సైతం అందిస్తుంది.బీన్స్ కూడా జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌ను నివారించ‌గ‌ల‌దు.బీన్స్‌లో పోష‌కాలు మెండుగా ఉంటాయి.

వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌కుండా ఉంటుంది.మ‌రియు కేశాలు షైనీగా కూడా మెరుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube