బాలచందర్ తమిళ్ లో దర్శకత్వం వహించిన ‘అపూర్వరాగంగాళ్’( Apoorvaragangal ) అనే సినిమాని తెలుగులో ‘ తూర్పు పడమర’ గా రీమేక్ చేస్తున్నపుడు ఒరిజినల్ సినిమాలో జయసుధ చేసిన క్యారెక్టర్ కోసం దాసరి వెతుకుతున్నారు.అదే సమయంలో అనుకోకుండా రవీంద్రభారతిలో జరిగిన ఒక డాన్స్ ప్రోగ్రామ్ కి ఆయన హాజరయ్యారు.
అక్కడ నాట్యం చేస్తున్న కనక విజయలక్ష్మి ని చూసి ఆయన వెతుకుతున్న పాత్ర దొరికేసిందని ఆనంద పడ్డారు.ఆమెకు విజయలక్ష్మి అనే పేరుని తీసేసి మాధవిగా నామకరణం చేసారు.
ఆ విధంగా ‘తూర్పు పడమర’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాధవి( Madhavi ).ఆ సినిమాలో ఆమె నటనను చూసినవాళ్లు ఎవరు ఆమెను కొత్త అమ్మాయి అని భావించలేదు.ఒక అనుభవం ఉన్న ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించింది మాధవి.ఆమె నటన బాలాచంద్రర్ కి బాగా నచ్చి ఆయన తీసే నెక్స్ట్ సినిమాలో మాధవికి ప్రధాన పాత్ర ఇవ్వడం కోసం ఆమెని కలిసాడు.
అలా మాధవి, కమల హాసన్ తో కలిసి ‘మరో చరిత్ర’ అనే సినిమాలో నటించింది.ఈ సినిమాలో మాధవి అద్భుతమైన నటన చూసి స్వయంగా కమల్ హాసన్( Kamal Haasan ) ఆయన నటించిన చాలా సినిమాలకు ఆమెని రికమెండ్ చేసాడు.
అలా మాధవి తన నటన విశ్వరూపాన్ని ఇండస్ట్రీకి చూపిస్తున్న మొదట్లో ఆమెకి ఎక్కువగా హీరో చెల్లి పాత్రలు వచ్చాయి.

ఆ తరువాత ‘బాపుగారి స్నేహం’ అనే సినిమాలో ఒక అందమైన పాత్రలో నటించింది.అలా చంద్రమోహన్( Chandramohan ) లాంటి హీరోలతో కూడా నటించింది.అ తరువాత చిన్నగా ‘చట్టానికి కళ్ళు లేవు ‘, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకుంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ ఖైదీ’ సినిమాలో మాధవి ‘విశ్వమిత్ర తపోభంగం’ అనే పాటకు చిరుకి పోటీగా స్టెప్పులు వేసి అదరగొట్టింది.ఈ పాటతోనే మాధవి కి ఉన్న డాన్సింగ్ టాలెంట్ ప్రపంచానికి అర్ధం అయింది.
అప్పట్లో టాప్ హీరోలు అయిన చిరంజీవి, కృష్ణ, శోభన్ బాబు లాంటి చాలామంది హీరోలతో జతకట్టింది.

భారతీరాజా దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘టిక్ టిక్ టిక్ ‘ సినిమా ద్వారా మాధవికి గ్లామర్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.కానీ అలాంటి పత్రాలను కంటిన్యూ చెయ్యకుండా కేవలం సీరియస్ రోల్స్ లో మాత్రమే నటించింది మాధవి.అయితే ఆమెలోని పూర్తి నటనను బయటకు తీసిన చిత్రం మాత్రం ‘మాతృదేవోభవ’ అనే చెప్పాలి.
అలా ఎన్నో సినిమాలో నటించిన మాధవి 1996లో ప్రముఖ వ్యాపారావేత్త అయిన శర్మను వివాహం చేసుకొని న్యూజెర్సీలో స్థిరపడింది.ఆమె తన ముగ్గురు పిల్లలను చూసుకుంటూ భర్తకు వ్యాపారంలో సహాయం చేస్తుంది.
అప్పుడప్పుడు ఆమె నటించిన సినిమాలు చూస్తుంటే మళ్లీ నటించాలనే కోరిక పుడుతుందట మాధవికి.







