టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్( Ram Charan ) భిన్నమైన పాత్రలకు ఓటేస్తూ కెరీర్ పరంగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు.మరికొన్ని రోజుల్లో గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer Movie ) నుంచి ట్రైలర్ రిలీజ్ కానుండగా గేమ్ ఛేంజర్ మూవీ ఫలితాన్ని ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ కోసం మెగా అభిమానులు ఒకింత ఆసక్తిగ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
అయితే కూతురిని ఎప్పుడు చూపిస్తావ్ చరణ్ అంటూ రామ్ చరణ్ అభిమానులు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
క్లీంకార(
Klin Kaara ) ఫోటోలు కొన్ని అనధికారికంగా వైరల్ అయినా అధికారికంగా రివీల్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.నూతన సంవత్సరం సందర్భంగా క్లీంకార ఫోటోలు రివీల్ చేస్తే బాగుంటుందని రామ్ చరణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

రామ్ చరణ్ ఉపాసన క్లీంకార ఫోటోలను రివీల్ చేయకూడదని నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయం అభిమానులకు భారీ షాక్ అవుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.మెగా అభిమానుల రిక్వెస్ట్ ను చరణ్ పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.మరోవైపు గేమ్ ఛేంజర్ తో చరణ్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

గేమ్ ఛేంజర్ మూవీ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.గేమ్ ఛేంజర్ సినిమా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.పుష్ప ది రూల్ సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
గేమ్ ఛేంజర్ సినిమా ఎలాంటి రికార్డులను బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.