50,000 ఏళ్ల తర్వాత కూడా చెక్కుచెదరని బేబీ మముత్.. శాస్త్రవేత్తలు షాక్!

సైబీరియా మంచుగడ్డల(Siberian ice floes) లోతుల్లో ఓ అద్భుతం వెలుగు చూసింది.50 వేల ఏళ్లనాటి బేబీ వూలీ మముత్ ( 50,000 years, Baby mammoth)బయటపడింది.ఇది ఆడది కావడంతో దీనికి యానా అని పేరు పెట్టారు.దీన్ని చూసి రష్యా శాస్త్రవేత్తలు (Russian scientists)షాక్ అయ్యారు.

 Baby Mammoth Remains Intact Even After 50,000 Years.. Scientists Are Shocked!, B-TeluguStop.com

ఎందుకంటే అన్ని ఏళ్లు గడిచినా సరే, యానా భౌతిక కాయం ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉంది.యాకుటియా ప్రాంతంలో, “పాతాళానికి ద్వారం” అని పిలిచే బటగైకా బిలం దగ్గర దీన్ని కనుగొన్నారు.

ఈ ప్రాంతంలో మంచు వేగంగా కరుగుతుండటంతోనే బేబీ మముత్ బయటపడింది.

యానా బరువు 100 కిలోలకు పైగానే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

దీని ఎత్తు 120 సెంటీమీటర్లు. తల, తొండం, చెవులు, నోరు (Head, trunk, ears, mouth)అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి.

ఇంత బాగా భద్రపరచబడిన మముత్‌ను ఇంతకుముందెప్పుడూ చూడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.నిజంగా ఇది చరిత్రలో ఒక గొప్ప ఆవిష్కరణ.

ఈ మముత్‌ను పరిశోధించడం ద్వారా, వేల సంవత్సరాల క్రితం జీవనం, వాతావరణ పరిస్థితులు ఇంకా మముత్ జాతి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

Telugu Baby Mammoth, Discovery, Paleontology, Permafrost, Siberia, Woolly Mammot

మముత్‌లు ఏనుగుల వలె ఉండే ఒక పురాతన జాతి.ఇవి మంచు యుగంలో జీవించాయి, వాటికి ఎక్కువ బొచ్చు, పొడవైన దంతాలు ఉంటాయి.వేల సంవత్సరాల క్రితమే ఇవి అంతరించిపోయాయి.

ఈ ఏడాది జూన్‌లో సైబీరియాలో(Siberian) మంచు కరగడంతో స్థానిక ప్రజలకు 50 వేల ఏళ్ల నాటి బేబీ మముత్ (Baby mammoth)కనిపించింది.ప్రపంచంలో ఇంత బాగా భద్రపరచబడిన మముత్ కళేబరాలు చాలా తక్కువ ఉన్నాయి.ఇప్పుడు యానాతో కలిపి వాటి సంఖ్య ఏడుకు చేరింది.

Telugu Baby Mammoth, Discovery, Paleontology, Permafrost, Siberia, Woolly Mammot

యానాను యాకుట్‌స్క్‌లోని నార్త్-ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్సిటీకి తరలించారు.ఇక్కడే మముత్ అవశేషాలపై పరిశోధనలు చేస్తారు.త్వరలోనే అక్కడ శాస్త్రవేత్తలు యానాపై క్షుణ్ణంగా పరిశోధనలు చేయనున్నారు.

జన్యు పరీక్షలు, సూక్ష్మజీవుల అధ్యయనాలు వంటివి చేసి, ఆనాటి జీవులు ఎలా జీవించాయో, వాతావరణానికి ఎలా అలవాటు పడ్డాయో తెలుసుకుంటారు.ఇదిలా ఉంటే పెర్మఫ్రాస్ట్ టైమ్‌ క్యాప్సూల్స్ లాగా పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని మిగతా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube