ఈ వంటింటి చిట్కాల‌తో క‌డుపు నొప్పి మ‌టాష్‌..!

దాదాపు ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో క‌డుపు నొప్పిని( Stomach Ache ) అనుభ‌వించే ఉంటారు.సాధార‌ణ క‌డుపు నొప్పి అనేక కార‌ణాల వ‌ల్ల సంభ‌వించ‌వ‌చ్చు.

 These Are The Best Home Remedies To Reduce Stomach Ache Details, Home Remedies,-TeluguStop.com

ఆహార‌పు అల‌వాటు, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, బాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు, శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించ‌క‌పోవ‌డం, తీవ్రమైన ఒత్తిడి, వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, నిద్ర‌లేమి త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల అప్పుడ‌ప్పుడు క‌డుపు నొప్పి ఇబ్బంది పెడుతుంటుంది.అలాంటి స‌మ‌యంలో ఇప్పుడు చెప్ప‌బోయే వంటింటి చిట్కాలు మీకు ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

క‌డుపు నొప్పి వేధిస్తున్న‌ప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బను( Garlic ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొల‌గించి తేనెలో( Honey ) ముంచి తీసుకోవాలి.ఈ వెల్లుల్లి, తేనె కాంబినేష‌న్ క‌డుపు నొప్పిను దూరం చేయ‌డంలో చాలా బాగా స‌హాయ‌ప‌డుతుంది.

క‌డుపులో గ్యాస్ ను తొల‌గిస్తుంది.

Telugu Ajwain, Coconut, Garlic Honey, Tips, Latest, Mint, Stomach Ache, Stomacha

కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వాము నీరు( Ajwain Water ) కూడా ప్రయత్నించవచ్చు.అందుకోసం ఒక గ్లాసు వాటర్ లో వన్ టీ స్పూన్ వాము వేసి బాగా మరిగించి.ఆ నీటిని తీసుకోవాలి.

ఈ వాము నీరు తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే కడుపునొప్పి నుంచి రిలీఫ్ పొందుతారు.జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా ప‌రార్ అవుతాయి.

Telugu Ajwain, Coconut, Garlic Honey, Tips, Latest, Mint, Stomach Ache, Stomacha

క‌డుపు నొప్పి వ‌స్తున్న‌ప్పుడు కొబ్బ‌రి నీరు( Coconut Water ) తాగితే చాలా మంచిది.కొబ్బరి నీరు తాగడం ద్వారా మీ శరీరానికి తేలికపాటి హైడ్రేషన్ లభిస్తుంది, మరియు కడుపులో శాంతి కలుగుతుంది.

పుదీనా న్యాచురల్ పెయిన్ కిల్లర్ మాదిరి పనిచేస్తుంది.కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు కొన్ని పుదీనా ఆకులను తీసుకుని ఒక గ్లాసు వాటర్ లో మరిగించి సేవించాలి.ఈ పుదీనా వాటర్ కడుపు నొప్పికి కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.జీర్ణవ్యవస్థను సరిదిద్దడంలో తోడ్పడుతుంది.

కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది.

ఇక క‌డుపు నొప్పి వేధిస్తున్న‌ప్పుడు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మరియు కొద్దిగా ఉప్పు కలిపి తాగండి.

ఇలా చేసినా కూడా త‌క్ష‌ణ‌ రిలీఫ్ పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube