ఆ బాక్సుల్లో బిర్యానీ తింటున్నారా..అయితే ఇది మీకోసమే

బిర్యానీ తింటే కాన్సర్ వస్తుందట.ఏంటి షాక్ అయ్యారా.

 Black Box Food Dangerous To Health,black Box,plastic,re Cycling,plastic Black Bo-TeluguStop.com

నిజమే ఆ బ్లాక్ బాక్సుల్లో నుంచి తెచ్చుకునే బిర్యానీ తింటే కచ్చితంగా వస్తుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.అసలు బిర్యానీ ఏంటి, బాక్స్ ఏంటి, కాన్సర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా.

ఆలస్యం చేయకుండా వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం.

ఒకప్పుడు బిర్యానీ( Biryani ) తినాలంటే వీక్ ఎండ్ వరకు వెయిట్ చేసేవాళ్ళు.

ఇప్పుడలా కాదు తినాలి అనిపిస్తే చాలు రెస్టారెంట్ కి వెళ్లిపోతున్నారు.కొత్త కొత్త పేర్లతో, కొత్త రెస్టారెంట్ లు వచ్చేసాయి.

అయితే చాలా మంది ఇంటికి తెప్పించుకొని మనకి నచ్చిన పాటలు వింటూ బిర్యానీని లాగించేస్తాం కదా.అయితే ఇక్కడ సమస్య బిర్యానీ కాదు.బిర్యానీ ఉన్న బాక్స్.

మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు బిర్యానీ ఒక బ్లాక్ బాక్స్( Black Box ) లో మన గుమ్మం ముందుకు వచ్చేస్తుంది.అయితే ఆ బాక్స్ లో వచ్చిన బిర్యానీ తింటే కాన్సర్ వచ్చే అవకాశం ఉంది.బిర్యానీ పార్సెల్ అంటే ఇప్పుడు ఒక బ్లాక్ బాక్స్ లో పెట్టి ఇచ్చేస్తున్నారు.

కస్టమర్లు కూడా ఏమి ఆలోచించకుండా వెంటనే తీసేసుకుంటారు.ప్లాస్టిక్ కవర్, బాక్స్ లో పార్సెల్ తెచ్చుకొని తినడం ఎంత హానికరమో ఎప్పుడైనా ఆలోచించారా.

బ్లాక్ ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయడం కష్టం.ప్లాస్టిక్ రెసిన్లకు కార్బన్ బ్లాక్ పిగ్మెంట్( Carbon Black Pigment ) జోడించడం ద్వారా దీనిని తయారు చేస్తారు.

దీని వల్ల పర్యావరణ కాలుష్యం కూడా పెరిగే ఛాన్స్ ఉంది.ప్లాస్టిక్ లో బ్లాక్ ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం.

కార్బన్ బ్లాక్ ప్లాస్టిక్‌లో PAH అంటే పాలీసైక్లిక్ హైడ్రోకార్బన్ ఉంటుంది.ఈ బ్లాక్ ప్లాస్టిక్ వల్ల కాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది.కాన్సర్( Cancet ) మాత్రమే కాదు ఈ ప్లాస్టిక్ వల్ల చాలా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందట.ఈ ప్లాస్టిక్ బాక్సులలో బిస్ ఫినాల్-ఎ, థాలేట్స్ వంటి కొన్ని రసాయనాలు ఉన్నాయని.

అవి అందులో ప్యాక్ చేసిన ఆహారంతో కలిసిపోతాయని అనేక అధ్యయనాలలో పేర్కొన్నారు.మీరు ఇప్పటికి ఆ బ్లాక్ బాక్సులలో తింటుంటే వెంటనే ఆలోచించండి.

ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో అని.ఈ ఆహరం తినడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.జర జాగ్రత్త.

Plastic Black Box Food Dangerous to Health

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube