ఎన్టీఆర్ ( NTR ) బామ్మర్ది నార్నే నితిన్ ( Nithin ) హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఈయన ఆయ్( Aay ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో హీరో నితిన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే ఈయన తన బాబా ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఎన్టీఆర్ మనకు సినిమా ఈవెంట్ లో కానీ లేదా సినిమాలలో కానీ చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు.అలాగే ఒక నటుడిగా ఆయన నటన డాన్స్ ఎలా ఉంటుంది అనే విషయాలు మనకు తెలుసు.మరి వ్యక్తిగత జీవితంలో ఎన్టీఆర్ ఎలా ఉంటారు ఏంటి అనే విషయాలు తెలుసుకోవడం కోసం అభిమానులు కూడా ఆరాటపడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే నితిన్ తన బావ ఎన్టీఆర్ గురించి ఆయన వ్యక్తిగత విషయాల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ నాకు ఇంట్లో నచ్చకపోతే నేను బావ వద్దకే వెళ్తానని తెలిపారు.ఆయన పైకి కనిపించే అంత గంభీరంగా ఉండరని, చాలా సరదాగా మాట్లాడుతూ అందరిని నవ్విస్తూ ఉంటారని నితిన్ తెలిపారు.ఇక బావ చాలా మంచి కుక్.
వంటలు బాగా చేస్తారు ముఖ్యంగా హలీం బిర్యానీ చాలా బాగా చేస్తారని ఎన్టీఆర్ గురించి నితిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఎన్టీఆర్ మంచిగా వండడమే కాకుండా బాగా వడ్డిస్తారని కూడా తన బావ గురించి ఆయన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించారు.
ఇక నితిన్ స్వయంగా లక్ష్మీ ప్రణతికి ( Lakshmi Pranathi ) సోదరుడు అనే విషయం మనకు తెలిసిందే.ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండా తన సొంత టాలెంట్ తో హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకుంటూ ఉన్నారు
.