సాధారణంగా సినిమాల్లో స్టార్ హీరోలు, హీరోయిన్లు ( Star heroes and heroines )తమ పాపులారిటీని ఉపయోగించుకొని రకరకాల కంపెనీలను ప్రమోట్ చేస్తుంటారు.అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు పుచ్చుకుంటారు.
అయితే కొన్నిసార్లు వీళ్లు ప్రజలకు, ప్రభుత్వాలకు నష్టం కలిగించే కంపెనీలను ప్రమోట్ చేస్తుంటారు.తెలిసో, తెలియకో అలాంటి ప్రమోషన్లకు ఒప్పుకుంటారు.
చివరికి వివాదాల్లో పడుతుంటారు.అయితే ఇటీవల కాలంలో ముగ్గురు సినీ సెలబ్రిటీలు ఇలాంటి కాంట్రవర్సీలలో చిక్కుకున్నారు.వారు ఎవరో తెలుసుకుందాం.
• అల్లు అర్జున్
( Allu Arjun )
కొన్నేళ్ల క్రితం అల్లు అర్జున్ బైక్ ట్యాక్సీ యాప్ ర్యాపిడో( Bike Taxi App Rapido ) కోసం చేసిన ఓ ప్రకటన పెద్ద వివాదాస్పదమైంది.అప్పటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వి.సి.సజ్జనార్ బన్నీకి, ర్యాపిడో కంపెనీలకు నోటీసులు ఇచ్చారు.ఆ ప్రకటనలో ప్రభుత్వ బస్సులను తక్కువ చేసి చూపించడం జరిగిందని ఆరోపించారు.
బన్నీ ఆ ప్రకటనలో దోశ వేస్తూ ఆర్టీసీ బస్సు ప్రయాణికులు దిగే సమయానికి దోసెలోని ఫీలింగ్ వలె అయిపోతున్నారు అంటూ మాట్లాడాడు.బస్సుల్లో ఎంతో కిక్కిరిసి ఉంటుంది కాబట్టి RTC ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
అందుకే రాపిడో బుక్ చేసుకోండి అని బన్నీ ఇన్‌డైరెక్ట్‌గా తెలిపాడు.దీంతో తెలంగాణ గవర్నమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి స్టార్ హీరోలు ప్రజల ఆలోచనలపై చాలా ప్రభావం చూపుతారు.కాబట్టి డబ్బు కోసం ప్రభుత్వానికి చెడు చేసే ప్రకటనలు చేయకూడదు అని సజ్జనార్ అన్నారు.
• తమన్నా భాటియా
( Tamannaah Bhatia )
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ‘ఫెయిర్‌ప్లే’ అనే యాప్‌ను ( Fairplay app )బాగా ప్రమోట్ చేసింది.తర్వాత ఇది ఒక బెట్టింగ్ యాప్ అని తేలింది.అంతేకాదు ఈ అప్లికేషన్ IPL మ్యాచ్‌లను చట్టవిరుద్ధంగా ప్రసారం చేసింది.దీనివల్ల లీగల్ గా రైట్స్ కొనుక్కున్న వారికి వందల కోట్ల నష్టం వచ్చింది.ఇలాంటి చాలా చెడ్డ యాప్‌ను తమన్నా ఎందుకు ప్రమోట్ చేసిందో తెలియక చాలామంది షాక్ అయ్యారు.మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించారు.
ఈ యాప్ ద్వారా IPL మ్యాచ్‌లపై బెట్టింగ్ కూడా జరిగింది.
• అక్షయ్ కుమార్
( Akshay Kumar )
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విమల్ యాడ్( Vimal Ad ) ప్రమోషన్లు చేసి అభిమానులను చాలా డిసప్పాయింట్ చేశాడు.అతన్ని చాలా దారుణంగా విమర్శించారు కూడా.అందువల్ల ఇలాంటి ప్రకటనల్లో ఇక నటించబోను అని అక్షయ్ కుమార్ స్పష్టం చేశాడు.