మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) బి గోపాల్ దర్శకత్వంలో నటించిన సూపర్ హిట్ చిత్రం ఇంద్ర ( Indra ) .వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.
ఇలా చిరంజీవి కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో ఇంద్ర కూడా ఒకటని చెప్పాలి.అయితే నేడు చిరంజీవి పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఇంద్ర సినిమాను తిరిగి విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ఊహించని విధంగా ఆదరణ లభిస్తుంది.ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే ( Sonali Bendre ) నటించారు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఇంద్ర సినిమాని తిరిగి విడుదల చేయడంతో నటి సోనాలి బింద్రే కూడా ఇంద్ర సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇంద్ర సినిమాని మరోసారి బిగ్ స్క్రీన్ పై చూడటం చాలా సంతోషంగా అనిపిస్తుందని తెలిపారు.చిరంజీవి గారితో నటించడం నా కెరియర్ లో మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతని వెల్లడించారు.ఇక చిరంజీవి గారి సినిమాలో నటించాలి అంటే ఆయనతో పాటుగా డాన్స్ చేయడం కోసం ప్రతి ఒక్కరూ భయపడతారని సోనాలి బింద్రే తెలిపారు.
డాన్స్ విషయంలో చిరంజీవి గారికి ఎవరు పోటీ ఉండరని ఈమె తెలిపారు.ఇకపోతే సోనాలి బింద్రే ఇంద్ర సినిమాలోని దాయి దాయి దామ్మా అనే పాట గురించి పలు విషయాలు తెలిపారు.ఈ పాట రేపు షూటింగ్ ఉంటుందని నాకు ఫోన్ కాల్ వచ్చింది అయితే ఆరోజు రాత్రి మొత్తం భయంతో నాకు నిద్ర పట్టలేదని తెలిపారు.ఇక ఇందులో చిరంజీవి గారు వేసే వీణ స్టెప్ ( Veena Step ) నన్ను ఎక్కడ వేయమంటారో నన్ను చాలా కంగారు పడ్డానని ఈమె ఈ పాట గురించి, చిరంజీవి గారి డాన్స్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.