ఇటీవల రోజుల్లో మధుమేహం ( Diabetes )బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.వయసు పైబడిన వారే కాదు పాతిక ముప్పై ఏళ్ల వారు కూడా మధుమేహం బారిన పడుతున్నారు.
ఆ తర్వాత షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు పచ్చి ఉల్లిపాయ చక్కటి ఔషధంగా చెప్పుకోవచ్చు.మందులకు లొంగని హై షుగర్ సైతం కంట్రోల్ చేసే సామర్థ్యం పచ్చి ఉల్లిపాయకు ఉంది.
అవును మీరు విన్నది నిజమే.మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు నిత్యం 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలను తింటే అద్భుతాలను గమనిస్తారు.50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ రెండు యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.పచ్చి ఉల్లిపాయను మధుమేహం ఉన్నవారు నేరుగా తిన్నా సరే లేదా అన్నంతో కలిపి తిన్నా సరే మంచిదే.
అలా అని ఒకేసారి తినాల్సిన అవసరం కూడా లేదు.రోజులో పచ్చి ఉల్లిపాయను( Onion ) కొంచెం కొంచెం గా కూడా తినొచ్చు.

పచ్చి ఉల్లిపాయను తీసుకుంటే కనుక సహజంగానే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.మధుమేహులు నిత్యం పచ్చి ఉల్లిపాయను తినడం అలవాటు చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.అంతేకాదు పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల గుండె పోటు ( Heart attack )వచ్చే ముప్పు తగ్గుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.నిద్రలేమి పరార్ అవుతుంది.

ఆస్తమా దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది. జలుబు, ( Cold )దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు పచ్చి ఉల్లిపాయ అడ్డుకట్ట వేస్తుంది.మరియు పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల ఎముకల బలహీనత దూరం అవుతుంది.
ఇక కాలిన గాయాలకు కూడా పచ్చి ఉల్లిపాయ న్యాచురల్ మెడిసిన్ లా పని చేస్తుంది.ఉల్లిపాయను మెత్తగా దంచి రసం తీసి కాలిన గాయాలపై రోజుకు రెండు సార్లు రాసుకోవాలి.
ఇలా చేస్తే కాలిన గాయాలు చాలా త్వరగా నయం అవుతాయి.