ఆవు నెయ్యిలో ఎన్నో ఉపయోగాలు

మన భారతదేశం లో ఆవుని అత్యంత పవిత్రంగా కొలుచుకుంటాం.ఆవులో ఉండే విశిష్ట లక్షణాలు మరే జంతువులోను లేవు.

 Benefits Of Cow Ghee-TeluguStop.com

ఆవు పాలతో కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.మన పూర్వీకులు అంటుంటారు ఆవు పాలు తాగిన‌ వాళ్ళు ఆవు దూడలా చలాకీగా ఉంటారు.

అదే గేదె పాలు తాగినవాళ్ళు వాటి పిల్లలా మందంగా ఉంటారు అని.ఆవు పాలనుంచి వచ్చే పెరుగు , నెయ్యితో ఎన్నో రకాల ప్రయోజనాలని కనుగొన్నారు.ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఆవు వల్ల‌ ఇన్ని లాభాలు ఉన్నాయా అని షాక్ తిన్నారు ఆ లాభాలు చెప్పారు కూడా.మ‌రి ఆ లాభాలేంటో మ‌నం కూడా చూసేద్దాం.

ఆవు పాలని రోజు ఒక టీ గ్లాసుడు త్రాగడం వల్ల శరీరం ఎంతో చురుకుగా ఉంటుంది.ఆవునెయ్యి ని రెండు ముక్కు రంధ్రాలలో వేసుకోవడం వలన నాడీసంబంధ వ్యవస్థ బాగా పనిచేస్తుంది… మతిమరుపు తగ్గుతుంది.

అంతేకాదు పక్షవాతం, మైగ్రేన్ తలనొప్పి పోతుంది.జుట్టు ఊడటం తగ్గి కొత్త జుట్టు వస్తుంది, నిద్ర హాయి గా పడుతుంది.

పాతబెల్లం లో 20 గ్రా ల ఆవునెయ్యి కలిపి తినిపిస్తే గంజాయి వంటి మత్తు పదార్ధాల మత్తు వదులుతుంది.

ఆవునెయ్యి తో అరికాళ్ళ మంటలు కూడా తగ్గుతాయి.

ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఒక చెంచాడు నెయ్యి తింటే వెంటనే ఎక్కిళ్ళు తగ్గుతాయి.పిల్లలలో కఫం , శ్లేష్మం ఎక్కువగా ఉంటె ఆవునెయ్యి పాతది ఛాతీకి వీపుకీ మాలిష్ చేయడం వలన ఫలితం కనపడుతుంది.

సన్నగా ఉన్నవాళ్ళు ఒక గ్లాసు పాలల్లో చెంచాడు ఆవునెయ్యి,ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి త్రాగితే బరువు పెరుగుతారు.

ఆవునెయ్యి లో కొలెస్ట్రాల్ ఉండదు సరికదా అధిక కొవ్వుని తగ్గిస్తుంది.

అంతేకాదు ఆవు నుంచీ వచ్చే మూత్రం ,పేడ ద్వారా సేంద్రియ ఎరువుచేస్తూ ఆరోగ్యకరమైన పంటలని పండిస్తున్నారు.ఇలా ఎన్నో లాభాలు గో మాత ద్వారా పొందుతున్నాం.

అందుకే గోవు సంరక్షణ చేసి వాటిని కాపాడుకోవడం ప్రతీ భారతీయుడి భాద్యతగా గుర్తించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube