శ‌రీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను ఇలా గుర్తించ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా?

కొలెస్ట్రాల్‌లో రెండు ర‌కాలు.ఒకటి మంచి కొలెస్ట్రాల్‌(హెడ్ డిఎల్).

 Signs Of High Cholesterol Levels In Body! Signs Of High Cholesterol, Cholesterol-TeluguStop.com

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే ఇది ఎంతో అవ‌స‌రం.హెడ్ డిఎల్ రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా అడ్డు క‌ట్ట వేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

అలాగే రెండొవ‌ది చెడు కొలెస్ట్రాల్‌(ఎల్‌డీఎల్‌).ఎటొచ్చీ ముప్పంతా దీనితోనే.

శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది.గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.

అందుకే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

ఇక శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు.

ప‌న్నెండు గంటల పాటు ఆహారం తీసుకోకుండా.టెస్ట్ చేయించుకుంటే మన శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎంత మోతాదులో ఉందీ.? మంచి కొలెస్ట్రాల్ ఎంత మోతాదులో ఉందీ.? అన్న‌వి తెలుస్తాయి.అయితే కాళ్ల‌లో క‌నిపించే కొన్ని కొన్ని ల‌క్ష‌ణాల బ‌ట్టీ కూడా శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని గుర్తించ‌వ‌చ్చు.మ‌రి లేటెందుకు ఆ ల‌క్ష‌ణాలు ఏంటో చూసేయండి.

కాళ్ల తిమ్మిరి. శ‌రీరంలో అధిక కొలెస్ట్రాల్ ఏర్ప‌డిన‌ప్పుడు క‌నిపించే ల‌క్ష‌ణాల్లో ఇది ఒక‌టి.

ముఖ్యంగా రాత్రి వేళ‌లో పాదాలు, కాలి వేళ్లు, మ‌డ‌మ‌లు తీవ్రంగా తిమ్మిరెక్కిపోతుంటాయి.ఇలా త‌ర‌చూ మీకు జ‌రుగుతుంటే ఖ‌చ్చితంగా వైద్యుల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

Telugu Bad Cholestrol, Cholesterol, Cholestrol, Hdl Levels, Tips, Latest, Ldl Le

అలాగే శ‌రీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే.కాళ్ల పాదాలు చ‌ల్ల‌గా మారిపోతుంటాయి.వ‌ర్షాకాలం, శీతాకాల‌మే కాదు.చివ‌ర‌కు వేస‌వి కాలంలోనూ పాదాలు చ‌ల్ల‌గా అయిపోతుంటాయి.ఇలా జ‌రిగినా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుని త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

Telugu Bad Cholestrol, Cholesterol, Cholestrol, Hdl Levels, Tips, Latest, Ldl Le

ఇక కాళ్లు బరువుగా ఉండ‌టం, త‌ర‌చూ కాళ్లు నొప్పులు పుట్ట‌డం, అరి కాళ్ల మంట‌లు, ఎక్కువ దూరం న‌డ‌వ‌లేక‌పోవ‌డం ఇవ‌న్నీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ పెరిగి న‌ప్పుడు క‌నిపించే ల‌క్ష‌ణాలే.కాబ‌ట్టి, ఇటువంటివి మీకు ఎదురైతే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వైద్య నిపుణుల‌ను సంప్ర‌దించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube