ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ఎన్నో వచ్చాయి.ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖుల జీవితాలు తెరమీద ఆవిష్కరించబడ్డాయి.
స్టోర్స్, పాలిటిక్స్, సినిమా, సోషల్ వర్క్, పోరాట యోధులు సహా పలువురి జీవిత కథల ఆధారంగా సినిమాలు రూపొందాయి.అయితే కొన్ని బయోపిక్స్ లో.ఎవరి జీవితం ఆధారంగా సినిమా తీశారో.వారే స్వయంగా నటించడం విశేషం.ఇంతకీ అలా నటించిన సినిమాలే ఏంటో ఇప్పుడు చూద్దాం.
అశ్విని

ప్రముఖ క్రీడాకారిణి అశ్విని నాచప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.పరుగుల రాణి పీటీ ఉష హవా కొనసాగుతున్న సమయంలో తనను ఓవర్ టేక్ చేసిన రన్నర్ అశ్వని.అప్పట్లో ఇదో సంచలనం అయ్యింది.
పీటీ ఉష తర్వాత అంతటి పేరు పొందిన క్రీడాకారిణి అశ్వని.ఆమె బయోపిక్ అశ్విని మూవీలో తనే స్వయంగా నటించింది.
మయూరి

ప్రఖ్యాత నాట్య కళాకారిణి సుధా చంద్రన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరక్కింది.ఓ ప్రమాదంలో ఆమె కాలు కోల్పోయింది.అనంతరం జైపూర్ పుట్ పెట్టుకుని నాట్య ప్రదర్శన చేసింది.అప్పట్లో అదో సంచలనం అయ్యింది.ఇదే కథాంశంగా సింగీతం శ్రీనివాస్ బయోపిక్ తీశారు.అందులే సుధా చంద్రన్ నటించారు.ఆ తర్వాత ఆమె సినిమా రంగంలోకి వచ్చింది.
సచిన్- ఏ బిలియన్ డ్రీమ్స్

ప్రముఖ క్రికెటర్ సచిన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఇదో డాక్యుమెంటరీ చిత్రం.ఇందులో తన ఒరిజినల్ విజువల్స్ నే వాడారు.అందువల్ల సచిన్ నటించినట్లుగా భావిస్తారు పలువురు సినీ జనాలు.
రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవిత చరిత్రను తానే స్వయంగా బయోపిక్ గా తీసుకుంటున్నాడు.ఇందులో మూడు పార్టులు ఉంటాయని చెప్పాడు.మొదటిది యంగ్ ఏజ్.రెండోది మిడిల్ ఏజ్.మూడోది ప్రస్తుతం జరుగుతున్నది చూపిస్తానని చెప్పాడు.చివరి పార్టులో తానే స్వయంగా నటిస్తానని చెప్పాడు.
సంజు

సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఇందులో రణ్ బీర్ కపూర్ అద్భుతంగా నటించారు.ఇందులో సంజయ్ దత్ ఓ పాటలో కనిపిస్తాడు.