పూజ గదిలో ఈ వస్తువులు ఉండడం అంత మంచిది కాదా..?

సాధారణంగా కొంత మంది మహిళలకు ఇది ఒక అలవాటుగా ఉంటుంది.ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు ( Shrines ) వెళ్లిన, ఏదైనా ప్రదేశాలకు వెళ్లిన చాలా వెరైటీగా కనిపించిన వస్తువులను కొనేసి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు.

 Isnt It Good To Have These Items In The Pooja Room Details, Items, Pooja Room,-TeluguStop.com

మరి ముఖ్యంగా కొంత మంది హౌస్ వైఫ్ లు ఏ పుణ్య క్షేత్రానికి వెళ్లిన సరే ఒక వస్తువును కొని తీసుకురావడం సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు.కానీ మనం కొనే వస్తువు అనేది మన ఇంటికి ( House ) కలిసి వస్తుందా? రాదా? అనేది కూడా ఒకసారి ఆలోచించాలని పండితులు చెబుతున్నారు.

హిందూ సంప్రదాయం ప్రకారం సంసారం చేసే ఇళ్లలో కొన్ని కొన్ని దేవుడి ఫోటోలు( God Photos ) ఉండకూడదు.ఆ దేవుడి ఫోటోలు ఉంటే నిష్ట నియమాలతో ఉండాలి.ప్రతి ఉదయం సూచి శుభ్రతగా ఇల్లు, వాకిళ్లు శుభ్రపరచుకొని సూర్యోదయాని కన్నా ముందే నిద్రలేచి దీపం వెలిగించాలి.అయితే కొంత మంది కొన్ని చిత్రాలను, కొన్ని ప్రమిదలు, కొన్ని విగ్రహాలు కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు తప్పిస్తే ఎప్పుడూ కూడా వాటికి పూజలు( Pooja ) లాంటివి చేస్తూ ఉండరు.ఏదో కొన్నామంటూ కొనేసి దేవుడి గదిలో పెట్టేస్తూ ఉంటారు.

అయితే కొన్ని కొన్ని సార్లు మన సమయం బాగోలేనప్పుడు అవి చాలా ప్రమాదకరంగా మారుతాయి అని పండితులు చెబుతున్నారు.మన జాతకాన్ని తల కిందలు చేసే శక్తి వాటికి ఉంటుంది.దయచేసి అలాంటి తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా ఏ వస్తువైనా సరే దేవునికి సంబంధించినది మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే తాకాలి.ముఖ్యంగా చెప్పాలంటే మాంసాహాలు తినేసి దేవుడికి సంబంధించిన వస్తువులను తాకకూడదని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube