బాలయ్య హోస్ట్ గా మారడానికి అసలు కారణం ఆయనేనట.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ( Nandamuri Balakrishna )ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అన్ స్టాపబుల్ సీజన్4( Unstoppable Season 4 ) ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

 Shocking Factors About Balakrishna Become Host Details Inside Goes Viral In Soci-TeluguStop.com

ఈ షోకు సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.బాలయ్య మాట్లాడుతూ దసరా అంటేనే అమ్మవారు అని శక్తి రూపం అని కామెంట్లు చేశారు.

గెలుపు అనేది మన చేతుల్లోనే ఉందని ఏదైతే కొత్తగా అనుకుంటామో ఆ జయం మనల్ని వరిస్తుందని బాలయ్య పేర్కొన్నారు.దసరా శరన్నవరాత్రులు దానికి ప్రతీక అని బాలయ్య అన్నారు.

నాన్న ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశారని బాలయ్య పేర్కొన్నారు.నాన్న స్పూర్తితోనే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా మారానని బాలయ్య చెప్పుకొచ్చారు.

గతంలో ఇలాంటి ఆఫర్లు చాలా వచ్చాయని బాలయ్య పేర్కొన్నారు.

Telugu Imdb, Allu Arvind-Movie

ఈ షో వేరే ఎవరైనా అడిగి ఉంటే నో చెప్పేవాడినని బాలయ్య కామెంట్లు చేశారు.అల్లు అరవింద్ ( Allu Arvind )గారి కోసమే ఈ షో ఒప్పుకున్నానని ఆయన వెల్లడించారు.అన్ స్టాపబుల్ షో( The unstoppable show ) ఐఎండీబీలో 18వ స్థానంలో ఉందని బాలయ్య పేర్కొన్నారు.

గత సీజన్లతో పోలిస్తే సీజన్4 బాగుంటుందని బాలయ్య పేర్కొన్నారు.ఈ షోకు గెస్టులుగా ఎవరు హాజరవుతారో తెలియాల్సి ఉంది.

Telugu Imdb, Allu Arvind-Movie

బాలయ్య బాబీ కాంబో మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్టు ప్రకటన వెలువడింది.సంక్రాంతి రేసులో మొత్తం ఎన్ని సినిమాలు విడుదలవుతాయో చూడాలి.చిరంజీవి బాలయ్య బాక్సాఫీస్ పోటీ మిస్ అయినందుకు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.చరణ్ బాలయ్య బాక్సాఫీస్ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాల్సి ఉంది.గేమ్ ఛేంజర్ మూవీకి శంకర్ దర్శకుడు కాగా బాలయ్య సినిమాకు బాబీ దర్శకత్వం వహించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube