పార్టీ మారిన వారే టార్గెట్ ?

ఎన్నికల ముందు తెలంగాణలో ఐటీ రైడ్స్ ( IT Raids in Telangana )హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ( Congress party ) నేతలే టార్గెట్ గా ఈ ఐటీ రైడ్స్ జరుగుతుండడంతో కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి.

 If The Party Changes It Raids Must , It Raids In Telangana, Congress Party, Bjp-TeluguStop.com

ఆ మద్య బి‌ఆర్‌ఎస్ నేతలే టార్గెట్ గా ఐటీ రైడ్స్ జరిగిన సంగతి విధితమే.ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు అది కూడా కాంగ్రెస్ లో కొత్తగా చేరిన వారే లక్ష్యంగా దాడులు జరుగుతుండడంతో ఈ రైడ్స్ వెనకున్నదేవరు అనే చర్చ జరుగుతోంది.

ఆ మద్య బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై( Ponguleti Srinivas Reddy ) ఇటీవల ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే.

Telugu Congress, Telangana, Mlc Kavitha-Politics

ఇక తాజాగా బిజెపి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరిన వివిక్ ఇంటిపై కూడా ఐటీ రైడ్స్ జరిగాయి.దీంతో ఈ రైడ్స్ వెనుక బీజేపీ, బి‌ఆర్‌ఎస్ ( BJP, BRS )పార్టీలు ఉన్నాయా ? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.బి‌ఆర్‌ఎస్ మరియు బీజేపీ మద్య అంతర్గత ఒప్పందాలు జరిగాయని కాంగ్రెస్ గత కొన్నాళ్లుగా విమర్శలు గుప్పిస్తూనే ఉంది.

ఎందుకంటే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) ధోషిగా రుజువైనప్పటికి ఆమెపై ఎల్లంటి చర్యలు తీసుకోకపోవడం, అధికారంలో ఉన్నవారిని వదిలి కాంగ్రెస్ నేతలపై ఈ మద్య ఐటీ రైడ్స్ జరుగుతుండడంతో బి‌ఆర్‌ఎస్ మరియు బీజేపీ అంతర్గత దోస్తీని మరింత నొక్కి చెబుతున్నారు హస్తం నేతలు.

Telugu Congress, Telangana, Mlc Kavitha-Politics

అయితే ఇటీవల బీజేపీ నుంచి బి‌ఆర్‌ఎస్ నుంచి నేతలు భారీగా కాంగ్రెస్ వైపు వెళుతుండడంతో ఈ వలసలను అడ్డుకునేందుకే కే‌సి‌ఆర్ మరియు మోడి సర్కార్ కలిసి ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నారనేది కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న మాట.ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం గ్యారెంటీ అని అందుకే కాంగ్రెస్ ను ఎలాగైనా తోక్కేయాలనే భావనతోనే ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నారట.అయితే ఈ పరిణామాలను కూడా బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ వైపు తోసేసి లభ్ది పొందేందుకు హస్తం పార్టీ భావిస్తోందనేది కొందరి వాదన.

మరి ఈ ఐటీ రైడ్స్ ఇలాగే కొనసాగుతాయా ? ఎన్నికల ముందు వీటి వల్ల ఏ పార్టీకి నష్టం ? ఏ పార్టీ లాభం ? అనే విషయాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube