మీ పెదాలు పింక్ అండ్ సాఫ్ట్‌గా మారాలా? అయితే ఈ చాక్లెట్ లిప్ బామ్ మీకే!

పెదాలు పింక్ కలర్ లో సాఫ్ట్ గా మెరిసిపోతూ ఉంటే చూపురుల‌కు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.అయితే వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, శరీరంలో వేడి ఎక్కువ అవడం, ధూమపానం, మృత కణాలు పేరుకు పోవడం తదితర కారణాల వల్ల పెదాలు నల్లగా నిర్జీవంగా మారుతుంటాయి.

 How To Make Chocolate Lip Balm For Pink And Soft Lips!, Chocolate Lip Balm, Lip-TeluguStop.com

దాంతో ఏం చేయాలో తెలియ‌క.నిర్జీవమైన పెదాల‌ను మళ్లీ అందంగా ఎలా మార్చుకోవాలో అర్థంగాక తీవ్రంగా మధన పడిపోతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే చాక్లెట్ లిప్ బామ్‌ను వాడితే ఎంత నల్లగా మరియు నిర్జీవంగా ఉన్న పెద్దలైనా కేవలం కొద్ది రోజుల్లోనే పింక్ అండ్ సాఫ్ట్‌గా మారతాయి.మరి ఇంతకీ ఆ చాక్లెట్ లిప్ బామ్ ను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు డార్క్ చాకో చిప్స్, రెండు టేబుల్ స్పూన్లు కోకో బటర్ వేసుకోవాలి.

ఆ తర్వాత ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో పెట్టుకుని చాకో చిప్స్ మరియు కోకో బ‌ట‌ర్ ను మెల్ట్‌ చేసుకోవాలి.ఇలా మెల్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లార బెట్టుకోవాలి.కంప్లీట్ గా కూల్ అయిన అనంతరం రెండు చుక్కలు వెనిల్లా ఎసెన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో ఒక గంట పాటు పెడితే చాక్లెట్ లిప్ బామ్‌ సిద్ధమయినట్టే.

ఈ హోం మేడ్ చాక్లెట్‌ లిప్ బామ్ ను రోజుకు మూడు, నాలుగు సార్లు వాడుతూ ఉంటే.సహజంగానే డార్క్ లిప్స్‌ పింక్ కలర్ లోకి ట‌ర్న్ అవుతాయి.

మ‌రియు పెదాలు మృదువుగా, కాంతివంతంగా సైతం మార‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube