నిజామాబాద్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించే సమయం వచ్చిందని తెలిపారు.
నిజామాబాద్ రూరల్ లో పోడుభూముల సమస్య తీరలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బాజిరెడ్డి గోవర్ధన్ ఇక్కడి ప్రజలకు చేసింది ఏమీ లేదని చెప్పారు.
ఆర్టీసీ కార్మికులను సైతం బాజిరెడ్డి గోవర్ధన్ మోసం చేశారని ఆరోపించారు.ఎర్రజొన్న రైతులపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు.
ప్రస్తుతం దొరల తెలంగాణ – ప్రజల తెలంగాణ మధ్య యుద్ధమని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్లు దోచుకుందన్నారు.
ఈ క్రమంలో తాము కట్టిన ప్రాజెక్టులను చూపి ఓట్లు అడుగుతామన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కు మేడిగడ్డను చూపి ఓట్లు అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు.కేసీఆర్ ను ఓడించేందుకే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.