శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై దాడి ఘటన : హర్యానా - పంజాబ్‌లలో ఎన్ఐఏ దాడులు, 15 చోట్ల తనిఖీలు

ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో( San Francisco ) వున్న భారత కాన్సులేట్ కార్యాలయంపై( Indian Consulate ) ఖలిస్తాన్ మద్ధతుదారులు జరిపిన దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది.

తాజాగా బధవారం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని 15 చోట్ల సోదాలు నిర్వహించింది.ఇప్పటికే పరస్పర న్యాయ సహాయ ఒప్పందం కింద అమెరికా అధికారుల నుంచి ఎన్ఐఏ( NIA ) నవంబర్ 14న సాక్ష్యాలు కోరింది.

సీసీటీవీ ఫుటేజ్ స్కానింగ్ ద్వారా 45 మంది ముఖాలను క్రౌడ్ సోర్సింగ్ కింద గుర్తించామని ఎన్ఐఏ తెలిపింది.కాన్సులేట్‌పై దాడి , విధ్వంసం కేసులో 10 మంది నిందితుల చిత్రాలను ఎన్ఐఏ సెప్టెంబర్ 21న విడుదల చేసింది.

వారి గురించి సాధారణ ప్రజల నుంచి సమాచారాన్ని కోరింది.ఈ నిందితుల కోసం వేర్వేరుగా “Request for Identification and Information” జారీ చేసింది.రెండు నోటీసుల్లో ఒక్కొక్కరి చొప్పున ఇద్దరు నిందితుల ఛాయాచిత్రాలు వుండగా.మూడోది ఈ కేసులో ప్రమేయం వున్న ఆరుగురి చిత్రాలను చూపుతోంది.

Telugu America, Amritpal Singh, Cctv Footage, Haryana, Indiaconsulate, Khalistan

ఈ ఏడాది మార్చిలో ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో శాన్‌ఫ్రాన్సిస్కోలో మార్చి 18న అర్ధరాత్రి సమయంలో కొందరు ఖలిస్తాన్ అనుకూలవాదులు భారత కాన్సులేట్‌లోకి చొరబడి దానిని తగులబెట్టేందుకు ప్రయత్నించారు.అదే రోజున ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ కొందరు నిరసనకారులు పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను ఛేదించుకుంటూ లోనికి ప్రవేశించారు.కాన్సులేట్ ప్రాంగణంలో రెండు ఖలిస్తానీ జెండాలను వుంచి అక్కడి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.

Telugu America, Amritpal Singh, Cctv Footage, Haryana, Indiaconsulate, Khalistan

ఆ తర్వాత జూలై 1న అర్ధరాత్రి మరోసారి కాన్సులేట్‌లోకి చొరబడి దానికి నిప్పంటించే ప్రయత్నం చేశారు.ఈ ఘటనలపై రంగంలోకి దిగిన ఎన్ఐఏ జూన్ 16న కేసు నమోదు చేసింది.ఐపీసీ , యూఏ (పీ) చట్టం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే నిరోధక చట్టంలోని అనేక సెక్షన్ల కింద అభియోగాలు మోపి దర్యాప్తు ప్రారంభించింది.విచారణలో భాగంగా ఎన్ఐఏ బృందం ఈ ఏడాది శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లి కీలక ఆధారాలు సేకరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube