అధిక రక్తపోటును తగ్గించటానికి సమర్ధవంతమైన ఇంటి నివారణలు

ఈ రోజుల్లో అధిక రక్తపోటు అనేది సాదారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది.ధమనులలో రక్తం మీద కృత్రిమ పీడనం ఏర్పడినప్పుడు వచ్చే పరిస్థితిని రక్తపోటు అని అంటారు.

 Home Remedies For High Blood Pressure-TeluguStop.com

సాధారణంగా రక్తపోటును సిస్టోలిక్ మరియు డయస్టాలిక్ కదలికల ద్వారా కొలుస్తారు.రక్తపోటు 140/90 mmHg పైన ఉంటే అధిక రక్తపోటుగా గుర్తిస్తారు.

రక్తపోటు తగ్గించుకోవటానికి అనేక మందులు ఉన్నాయి.కానీ అధిక రక్తపోటును సహజంగా తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు కూడా ఉన్నాయి.

 Home Remedies For High Blood Pressure-Home Remedies For High Blood Pressure-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

1.అరటి పండు

అరటిపండు రక్తపోటును తగ్గించటానికి ఉత్తమ సహజ నివారణ మార్గంగా చెప్పవచ్చు.

అధిక రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే ప్రతి రోజు ఒకటి లేదా రెండు అరటిపండ్లను తినాలి.అరటిపండులో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.అలాగే తక్కువ సోడియం స్థాయిలు, కొలెస్ట్రాల్ తగ్గించటానికి కూడా అరటిపండు సహాయపడుతుంది.

2.వెల్లుల్లి

రక్తపోటును నియంత్రించటానికి వెల్లుల్లిలో గొప్ప లక్షణాలు ఉన్నాయి.దీనిని పచ్చిగా లేదా వండిన రూపంలో గాని తింటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

రక్తపోటు స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను క్రమం తప్పకుండా తినాలి.లేకపోతే నాలుగు స్పూన్ల నీటిలో ఐదు చుక్కల వెల్లుల్లి రసాన్ని కలిపి కూడా త్రాగవచ్చు.వెల్లుల్లి హైడ్రోజెన్ సల్ఫైడ్ ని ఉత్పత్తి చేయటం వలన అది రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించి గుండెపై బారాన్ని తగ్గిస్తుంది.

3.ఆకుకూరలు

ఆకుకూరల్లో ‘ఫైటో’ 3-ఎన్-బుత్య్ల్ ఫ్తలిదే’ సమృద్దిగా ఉండుట వలన అధిక రక్తపోటు స్థాయిలను నియంత్రించటానికి సహాయపడుతుంది.రక్తపోటు స్థాయిల స్థిరీకరణకు ప్రతి రోజు ఆహారంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.అధిక రక్తపోటుకు కారణం అయిన రక్తనాళాల బిగుతు మరియు ఒత్తిడి హార్మోన్స్ ని తగ్గిస్తుంది.

4.నిమ్మకాయ

నిమ్మకాయ అనేది అధిక రక్తపోటును నివారించటానికి ఉత్తమ నివారణలలో ఒకటిగా ఉంది.ఇది రక్తపోటు స్థాయిలను తగ్గించి,రక్తనాళాలను మృదువుగా మరియు సౌకర్యవంతముగా చేస్తుంది.

నిమ్మకాయలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన గుండె వైఫల్యాన్ని నిరోదిస్తుంది.అందువల్ల అధిక రక్తపోటు ఉన్నవారు రోజులో వీలైనన్ని సార్లు నిమ్మరసాన్ని త్రాగాలి.

ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube