సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ( Suryadevara Naga Vamsi ) త్వరలోనే డాకూ మహారాజా( Daku Maharaj ) సినిమా ద్వార ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.డైరెక్టర్ బాబి ( Director Bobby ) దర్శకత్వంలో బాలకృష్ణ( Balakrishna ) హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే నాగ వంశీ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ వంశీ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు.
డైరెక్టర్ బాబి బాలకృష్ణను దృష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్ధం చేశారని తెలిపారు.ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయని ముగ్గురు హీరోయిన్స్ ఈ సినిమాలో నటించబోతున్నారు అంటూ సినిమాకు సంబంధించిన పలు విషయాలను తెలియజేస్తూ ఈయన సినిమాపై అంచనాలను పెంచేశారు.ఆఖండ సినిమా నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య ఈ సినిమా ద్వారా కూడా మరో మంచి సక్సెస్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఇకపోతే తాజాగా నాగ వంశీ సినిమా టికెట్ల రేట్ల ( Tickets Price ) గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.తాము ఏడాదిలో విడుదల అయ్యే ప్రతి సినిమాకు టికెట్ల రేట్లు పెంచమని ప్రభుత్వాలను కోరడం లేదని తెలిపారు.దేవర సినిమాకు( Devara Movie ) నేను పెట్టిన ఖర్చు ఎంత ఆ సినిమాని బయ్యర్లకు ఎంతకు అమ్మాను దాని ఆధారంగానే మేము ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ ఇంత టికెట్ రేటు పెంచాలని కోరుతాము.
సినిమా టికెట్ ధరల విషయంలో ఏ రేట్ కరెక్ట్.ఏది కాదు అని ఎవరూ చెప్పలేము అంటూ వెల్లడించాడు.సినిమా పూర్తయిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని టికెట్ రేటు ఉంటుందని నాగ వంశీ తెలిపారు.ఇక ఏడాదిలో విడుదల అయ్యే అన్ని సినిమాలకు టికెట్ల రేట్లు పెంచమని మేము అడగము.
ఈ ఏడాదిలో దేవర, పుష్ప 2, కల్కి సినిమాలకు టికెట్లు రేట్లు పెంచమని మాత్రమే కోరాము అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.