పుష్ప ది రూల్ మూవీ జీఎస్టీ రీఫండ్ లెక్కలివే.. ఏకంగా అంత వెనక్కు ఇచ్చారా?

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్,( Allu Arjun ) సుకుమార్( Sukumar ) కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన సినిమా పుష్ప 2.( Pushpa 2 ) ఇటీవల డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీగా వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే.

 Pushpa 2 Gst Refund Of Rs 35 Crores Details, Pushpa 2, Tollywood, Allu Arjun,pus-TeluguStop.com

విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది.దాదాపుగా 2 వేల కోట్ల వసూలు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా వసూళ్లు 2000 కోట్లు వచ్చినప్పటికీ ప్రస్తుతం నిర్మాతల పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.కేవలం ఒక్క తెలుగులో మాత్రమే 35 కోట్ల మేరకు జీఎస్టీ( GST ) బయర్లకు ఇవ్వాల్సిన పరిస్థితి.

కాగా టాలీవుడ్ బిజినెస్ లెక్కల ప్రకారం అమ్మిన రేటు మేరకు వసూళ్లు రాకపోతే నిర్మాతలు జీఎస్టీని బయ్యర్లకు ఇవ్వాల్సి ఉంటుంది.

Telugu Allu Arjun, Pushpa, Pushpa Buyers, Pushpa Gst, Pushpa Stats, Pushpa Rule,

ఇచ్చిన రేటు అంతే అంటే 20 కోట్లకు అమ్మితే 20 కోట్లు మాత్రమే చేసినా జీఎస్టీని నిర్మాతే భరించాలి.ఇరవై కోట్లకు అమ్మితే 22 కోట్లు చేస్తేనే జీఎస్టీని బయ్యర్ భరిస్తారు.ఇదో పద్ధతి.

అయితే ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 35 కోట్ల మేరకు నిర్మాతనే జీఎస్టీ చెక్కులు బయ్యర్లకు పంపాల్సిన పరిస్థితి ఉంది.ఒక్క సీడెడ్ మినహా మరెక్కడా ఇంకా బ్రేక్ ఈవెన్ మార్క్‌ కు చేరలేదు పుష్ప 2.అందువల్ల జీఎస్టీలు నిర్మాత భరించాల్సిందే.అంటే నిర్మాతకు వచ్చే లాభాల్లో ఈ మేరకు తగ్గిపోతుందన్నమాట.

అదనపు రేట్లు, అదనపు షోలు, స్పెషల్ ప్రీమియర్ల రేట్లు ఇవన్నీ కలిస్తేనే పుష్ప 2 ఈ భారీ నెంబర్లు నమోదు చేసింది.

Telugu Allu Arjun, Pushpa, Pushpa Buyers, Pushpa Gst, Pushpa Stats, Pushpa Rule,

సినిమాను భారీ రేట్లకు అమ్మారు.భారీ రేట్లు రప్పించడం కోసం స్పెషల్ ప్రీమియర్ల రేట్లు 800 నుంచి 1200 వసూలు చేశారు.రెండు వారాల పాటు అదనపు రేట్లు వసూలు చేశారు.

ఇన్ని చేసినా సీడెడ్ మినహా మరెక్కడా బ్రేక్ ఈవెన్ కాలేదు.అదే కనుక అదనపు రేట్లు, షోలు రాకపోయి ఉంటే తమిళనాడు, కేరళల మాదిరిగా తీసుకున్న వాటిలో కొంత వెనక్కు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది.

ఈ లెక్కల విషయాలు తెలిసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు.ఇకపోతే ప్రస్తుతం పుష్ప సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సక్సెస్ఫుల్గా ప్రసారం అవుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు మరిన్ని కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube