సినీ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన వారిలో సీనియర్ నటి కస్తూరి శంకర్( Kasturi Shankar ) ఒకరు.ఈమె పలు సినిమాలలో నటించి అనంతరం పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు.
అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కస్తూరి శంకర్ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో అలాగే పలు సీరియల్స్ లో తల్లి పాత్రలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉండే కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఈమె ప్రతి విషయంపై స్పందిస్తూ తనదైన శైలిలో తనకు తోచిన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు.
ఇలా తన అభిప్రాయాలను తెలియజేసే క్రమంలోనే ఈమె ఎన్నో వివాదాలు నిలుస్తూ ఉన్నారని చెప్పాలి.ఏ విషయం గురించి అయినా నిర్మహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడే తత్వమే తనకు వివాదాలను కూడా తీసుకువస్తుంది.గత కొద్దిరోజులుగా తెలుగు వారి గురించి ఈమె చేసిన వ్యాఖ్యల కారణంగా ఏకంగా జైలుకు( Jail ) కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇలా నోటి దూల కారణంగా కటకటాల వెనక్కి వెళ్లిన కస్తూరి శంకర్ అనంతరం బెయిల్( Bail ) మీద బయటకు వచ్చారు.
ఇకపోతే ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన జైలు జీవితానికి సంబంధించిన విషయాలను కూడా తెలిపారు.అలాగే ఎన్నో తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేస్తున్నారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన పిచ్చి కోరికను బయటపెట్టారు.
ప్రతిరోజు రాత్రి అయితే నాకు ఆ కోరిక తీరాల్సిందేనని మరుసటి రోజు ఉదయం ఎందుకు అలా చేశానా అంటూ గిల్టీగా ఫీల్ అవుతాను అంటూ ఈమె అసలు విషయం వెల్లడించారు.మరి ఈమె రాత్రి అయితే ఆపుకోలేకపోతున్న ఆ కోరిక వింటే మాత్రం ముక్కున వేలు వేసుకోవాల్సిందే.
రాత్రి 9 అయితే తనకు ఆలూ చిప్స్( Aaloo Chips ) తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతుందట.అలా ఆలు చిప్స్ తినందే తనకు నిద్ర పట్టదని ఈ సందర్భంగా కస్తూరి శంకర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.